కూనారం ఆర్వోబీ పూర్తిచేయాలి
పెద్దపల్లి: కూనారం – పెద్దపల్లి మధ్య జిల్లాకేంద్రంలో చేపట్టిన ఆర్వోబీ పనులను వచ్చే ఏడాది జూలై వరకు పూర్తిచేయాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆదేశించారు. స్థానిక రైల్వే ఫ్లైఓవర్, ఆర్ అండ్ బీ అతిథి గృహం ప్రహరీ, జెడ్పీ కార్యాలయ భవన నిర్మాణాలను ఆయన మంగళవారం పరిశీలించారు. రూ. 119.50 కోట్ల వ్యయంతో ఆర్వోబీ నిర్మాణం చేపట్టారని కలెక్టర్ అన్నారు. ఆర్ అండ్ బీ అతిథి గృహం ప్రహరీ పనుల్లో వేగం పెంచాలని సూచించారు. కార్యక్రమంలో ఆర్డీవో గంగయ్య, అధికారులు భావ్‌సింగ్, రాజ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.
రైతుల బ్యాంకు ఖాతాల్లో బోనస్ జమ
సన్నరకం వడ్లు విక్రయించిన రైతుల బ్యాంకు ఖా తాల్లో ఇప్పటివరకు రూ.96.85 కోట్లు జమచేశామని కలెక్టర్ కోయ శ్రీహర్ష తెలిపారు. జిల్లాలో 333 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయగా, ఈనెల 29వ తేదీవరకు 272 కేంద్రాల్లో కొనుగోళ్లు పూర్తిచేశామని ఆయన పేర్కొన్నారు.
జూలై వరకు అందుబాటులోకి తేవాలి
కలెక్టర్ కోయ శ్రీహర్ష


