కమిషనర్‌పై చర్య తీసుకోండి
● మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ ● కలెక్టర్‌కు ఫిర్యాదు
గోదావరిఖని: ఇష్టారాజ్యంగా కూ ల్చివేతలకు పాల్పడుతున్న రామగుండం మున్సిపల్ కమిషనర్‌పై చర్య తీసుకోవాలని మాజీఎమ్మెల్యే కోరుకంటి చందర్ కోరారు. బుధవారం కలెక్టర్ కోయ శ్రీహర్షను కలిసి ఫిర్యాదు చేశారు. రెండేళ్లుగా ఇష్టానుసారంగా దుకాణాల కూల్చివేతలు చేపడుతున్నారని ఫిర్యాదు చేశారు. అక్రమంగా కూల్చివేతలకు పాల్పడుతున్నా ఎందుకు చర్య తీసుకోవడం లేదని ప్రశ్నించారు. 43 మైసమ్మ గుడులను కూడా కూల్చివేశారని, అయినా, బాధ్యులపై చర్యలు తీసుకోలేదని గుర్తుచేశారు. కార్యక్రమంలో బీఆర్‌ఎస్ నాయకులు పర్లపల్లి రవి, నారాయణదాసు మారుతి, నీరటీ శ్రీనివాస్ పాల్గొన్నారు.


