అందరి సహకారంతో ప్రగతి
అధికారులు, ప్రజాప్రతినిధు లు, మంత్రుల సహకారంతో జిల్లా ప్రగతిని పరుగులు పెట్టిస్తాం. ప్రభుత్వ లక్ష్యాలకు అనుగుణంగా సంక్షేమ పథకాలు అర్హులకు చేరవేస్తాం. విద్య, వైద్యంపై ప్రత్యేక దృష్టి సారించాం. పారిశుధ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటాం.
– కోయ శ్రీహర్ష, కలెక్టర్
నేరాలు నియంత్రిస్తాం
జిల్లావ్యాప్తంగా ప్రతీగ్రామంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశాం. తద్వారా నేరాలను నియంత్రిస్తాం. రోడ్డు ప్రమాదాల నియంత్రణకు రహదారుల వెంట బ్లాక్ స్పాట్లు గుర్తించి తగిన చర్యలు తీసుకుంటాం. ప్రతీఇంట్లో సీసీ కెమెరా ఏర్పాటు చేసుకోవాలి.
– రాంరెడ్డి, డీసీపీ, పెద్దపల్లి
ఆర్థికంగా నిలదొక్కుకోవాలి
కొత్త సంవత్సరంలో జిల్లావాసులు సుఖశాంతులతో ఉండాలి. రైతులకు పంటలు బాగా పండించాలి. అంద రూ ఆర్థికంగా నిలదొక్కుకోవాలి. యువత, నిరుద్యోగులు స్వయం ఉపాధి పథకాల ద్వారా ఉపాధి పొందాలి. ప్రభుత్వ ఉద్యోగాలూ సాధించాలి.
– విజయరమణారావు, ఎమ్మెల్యే, పెద్దపల్లి
టూరిజం హబ్ లక్ష్యం
800 మెగావాట్ల పవర్‌ప్లాంట్‌కు శంకుస్థాపన చేస్తాం. సింగరేణి 500 మెగావాట్ల పంప్‌డ్ స్టోరేజీ పవర్ ప్లాంట్ పనులు ప్రారంభిస్తాం. టూరిజం, బిజినెస్, పవర్, మెడికల్, ఎడ్యుకేషన్ హబ్‌లుగా తీర్చిదిద్దేందుకు ప్రణాళికతో ముందుకు సాగుతున్నాం.
– రాజ్‌ఠాకూర్, ఎమ్మెల్యే, రామగుండం
అందరి సహకారంతో ప్రగతి
అందరి సహకారంతో ప్రగతి
అందరి సహకారంతో ప్రగతి


