ప్రభుత్వ ఆస్పత్రి తనిఖీ
కోల్‌సిటీ(రామగుండం): గోదావరిఖని ప్రభు త్వ జనరల్ ఆస్పత్రి(జీజీహెచ్)ని కలెక్టర్ కో య శ్రీహర్ష బుధవారం ఆకస్మికంగా తనిఖీ చే శారు. క్రిటికల్ కేర్, ఆర్థోపెడిక్ సర్జరీ బ్లాక్, ఓ పీ విభాగాలను సందర్శించారు. అధికారుల తో సమావేశమయ్యారు. వైద్యులు సమయపాలన పాటించాలని, పేషెంట్లకు మెరుగైన వై ద్యసేవలు అందించాలని ఆయన ఆదేశించా రు. తమకు ఫిర్యాదులు రాకుండా వైద్యసిబ్బంది సేవలు అందించాలని సూచించారు. ఆస్ప త్రి సూపరింటెండెంట్ దయాళ్‌సింగ్, ఆర్‌ఎంవోలు కృపాబాయి, దండె రాజు పాల్గొన్నారు.
నిబంధనలు అతిక్రమించొద్దు
పెద్దపల్లి: నూతన సంవత్సరం సందర్భంగా జి ల్లావాసులు ప్రశాంత వాతావరణంలో వేడుక లు జరుపుకోవాలని, నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఏసీపీ కృష్ణ అ న్నారు. సీఐ ప్రవీణ్ కుమార్, ఎస్సైలు లక్ష్మణ్‌రావు, మల్లేశ్, శ్రీధర్‌తో కలిసి బుధవారం జి ల్లా కేంద్రంలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. మద్యం, గంజాయి తదితర మత్తు పదార్థాలు తీసుకుని అతివేగంగా వాహనాలు నడపొద్దని, ట్రిబుల్ రైడింగ్ చేయవద్దని సూచించారు. బెల్ట్‌షాపులు మూసివేయాలని అన్నారు. ప్రతీ జంక్షన్ వద్ద పోలీస్‌లు ఉంటా రని, పెట్రోలింగ్ పార్టీలు తిరుగుతాయన్నారు.
జాతీయ పోటీలకు ఎంపిక
ధర్మారం(ధర్మపురి): స్థానిక ఆదర్శ పాఠశాల విద్యార్థి మేరగుతత్తుల యశ్వంత్‌తేజ అండ ర్– 14లో జాతీయస్థాయి వాలీబాల్ పోటీ ల కు ఎంపికై నట్లు పీఈటీ బైకని కొమురయ్య తె లిపారు. మేడారం గ్రామానికి చెందిన యశ్వంత్‌తేజ.. ఏడో తరగతి చదువుతున్నాడు. ఈనె ల 5 నుంచి 9వ తేదీ వరకు హిమాచల్‌ప్రదేశ్ లో జరిగే ఎస్జీఎఫ్ 69వ జాతీయ స్థాయి పోటీలకు తెలంగాణ జట్టు తరఫున యశ్వంత్ పా ల్గొంటాడన్నారు. విద్యార్థిని ప్రిన్సిపాల్ రాజ్‌కుమార్ బుధవారం అభినందించారు. వ్యాయా మ ఉపాధ్యాయులు కొమురయ్య, మేకల సంజీవరావు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
అన్నివర్గాలు బాగుండాలి
మంథని: కొత్త సంవత్సరంలో అన్నివర్గాలు సుఖసంతోషాలతో ఉండాలని మంథని మాజీఎమ్మెల్యే పుట్ట మధు ఆకాక్షించారు. 2025కు గుడ్‌బై చెబుతూ, 2026కు ఆహ్వానం పలుకుతూ స్థానిక రాజగృహలో బుధవారం బీఆర్‌ఎస్ పార్టీ శ్రేణులు వేడుకలు జరుపుకున్నారు. పుట్ట మధు న్యూ ఇయర్ కేక్ కట్ చేసి మిఠాయిలు పంపిణీ చేశారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా పరిషత్ మాజీ చైర్‌పర్సన్ జక్కు శ్రీహర్షిణి తదితరులు పాల్గొన్నారు.
క్వింటాల్ పత్తి రూ.7,468
పెద్దపల్లిరూరల్: స్థానిక వ్యవసాయ మార్కెట్‌యార్డు ఆవరణలో బుధవారం పత్తి క్వింటాల్‌కు గరిష్టంగా రూ.7,468 ధర పలికింది. కనిష్టంగా రూ.5,222, సగటు రూ.7,188గా ధర నమోదైందని మార్కెట్ ఇన్‌చార్జి కార్యదర్శి ప్రవీణ్‌రెడ్డి తెలిపారు. బుధవారం 227 క్వింటాళ్ల పత్తి కొనుగోలు చేసినట్లు పేర్కొన్నారు.
ఫేక్‌ఫోన్‌కాల్స్‌కు స్పందించొద్దు
పెద్దపల్లిరూరల్: తాను మున్సిపల్ కమిషనర్ కోటేశ్వర్‌రావును మాట్లాడుతున్నానని, ట్రేడ్స్ లైసెన్స్ రెన్యూవల్ చేసుకోవాలని, ఇందు కో సం ఫోన్‌పే ద్వారా ఫీజు చెల్లించాలని కొందరు గుర్తుతెలియనివారు వ్యాపారులకు ఫోన్‌చేస్తున్నారని, ఇలాంటి వాటిని నమ్మొద్దని బల్దియా కమిషనర్ వెంకటేశ్ తెలిపారు. పన్ను చెల్లించాలంటూ తమ ఆఫీసు నుంచి ఎవరూ ఫోన్‌కాల్స్ చేయరని, అధికారులు మీవద్దకే వస్తారన్నారు. ఫోన్‌కాల్స్‌పై సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేస్తామని కమిషనర్ వివరించారు. మరోవైపు.. మాజీ ఎంపీపీ డాక్టర్ జయలక్ష్మి పేరిట ఇన్‌స్ట్రాగామ్‌లో ఆమె ఫొటోను ఉంచి రూ.15వేలను ఫోన్‌పే చేయాలని గుర్తుతెలియని వ్యక్తులు పోస్టు చేశారని, ఎవరూ స్పందించొద్దని జయలక్ష్మి కోరారు.
ప్రభుత్వ ఆస్పత్రి తనిఖీ
ప్రభుత్వ ఆస్పత్రి తనిఖీ


