సమాజానికి ఏం చేస్తున్నారు?
మంథని: తన తండ్రి ఆశయ సాధన కోసమే పనిచేస్తున్నానని చెబుతున్న మంథని ఎమ్మెల్యే శ్రీధర్‌బాబు.. ఆ ఆశయం ఏమి టో సమాజానికి తెలియజెప్పాలని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధు సవాల్ చేశారు. స్థానిక అంబేడ్కర్ చౌక్‌లో మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు, చిన్నకాళేశ్వరం పూర్తిచేస్తానని చెప్పి ఇప్పటివరకూ పూర్తిచేయలేదన్నారు. గెలిచిన రెండ్రోజులకే ఇసుక బంద్ చేస్తామన్నా.. ఇంకా ఆచరణలో చూపలేదని విమర్శించారు. ఇప్పటివరకు నలుగురికి కూడా ఉద్యోగాలు పెట్టించకపోవడమేనా తన తండ్రి ఆశయ సాధనా? అని ప్రశ్నించారు. సమాజాన్ని మేల్కొల్పాలని తాను తపన పడుతుంటే.. తనవాళ్లతో కొట్టిస్తానని బెదిరిస్తున్నారని మధు ఆరోపించారు. తాను బెదిరింపులకు భయపడనన్నారు. త నకు అన్నివిషయాలపై అవగాహన ఉందని, వాటి ని త్వరలోనే బయటపెడుతానని తెలిపారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మాజీ జెడ్పీ చైర్ పర్సన్ జక్కు శ్రీహర్షిణీరాకేశ్, నాయకులు ఏగోళపు శంకర్‌గౌడ్, తరగం శంకర్‌లాల్, ఆరెపల్లి కుమార్, కనవేన శ్రీనివాస్, పుప్పాల తిరుపతి, పెగడ శ్రీనివాస్, మాచిడి రాజూగౌడ్ తదితరులు పాల్గొన్నారు.


