కొరాపుట్: ప్రభుత్వం తెచ్చిన కొత్త నిబంధనలకు వ్యతిరేకంగా రైతులు ఆందోళనకు దిగారు. సోమవారం జయపూర్ సబ్ కలెక్టర్ కార్యాలయం ప్రాంగణానికి వందలాది రైతులు తరలి వచ్చారు. కార్యాలయం లోపల కొరాపుట్ కలెక్టర్ సత్యవాన్ మహాజన్ ఉన్నారని తెలిసి వచ్చామని సిబ్బందికి తెలియ జేశారు. వందల సంఖ్యలో ఉన్న రైతులు లోపలకి రావడానికి వీలు కాలేదు. దీంతో రైతులు ఆందోళన నిర్వహించారు. తక్షణం ప్రభుత్వం తమ నూతన రైతాంగ విధానం వెనక్కి తీసుకోవాలని కృషక్ కళ్యాణ్ మంచ్ డిమాండ్ చేసింది. అనంతరం కలెక్టర్ బయటకు వచ్చి రైతులతో మాట్లాడారు.


