వరకట్న వేధింపులు చట్టరీత్యా నేరం | - | Sakshi
Sakshi News home page

వరకట్న వేధింపులు చట్టరీత్యా నేరం

Aug 12 2026 3:22 AM | Updated on Aug 12 2026 3:22 AM

పర్లాకిమిడి: వరకట్నం వేధింపులకు పాల్పడ్డ కుటుంబ సభ్యులైనా, కట్టుకున్న భర్త అయినా చట్టప్రకారం శిక్షార్హులే అని ఏడీఎం మునీంద్ర హానగ మంగళవారం అన్నారు. స్థానిక కలెక్టరేట్‌ హాల్‌–2లో వరకట్న నిషేధ నియమావళి 1961 చట్టం, జిల్లాస్థాయి ప్రశిక్షణ కేంద్రంలో ముఖ్యఅతిథిగా మాట్లాడారు. చైల్డ్‌ వెల్ఫేర్‌ కమిషన్‌, చైర్మన్‌ అమియ గౌడో మాట్లాడుతూ.. వరకట్నం వేధింపులకు పాల్పడ్డ వ్యక్తులకు చట్టప్రకారం ఆరు నెలలు జైలు శిక్ష, రూ. 30 వేలు జరిమానా పడతుందని అన్నారు. శిక్షణ శిబిరంలో డీఎస్పీ నిరంజన్‌ బెహారా, సబ్‌ కలెక్టర్‌ అనుప్‌ పండా, సీనియర్‌ ఆడ్వకేటు ప్రమోద్‌ రవుళో, జిల్లా ప్రోటెక్షన్‌ అధికారిణి సరలా పాత్రో, జిల్లా సామాజిక సంక్షేమ శాఖ అధికారులు, సీడీపీవోలు, సఖీ ఒన్‌స్టాప్‌ సెంటర్‌, బ్లాక్‌ స్థాయి అధికారులు, ఎన్జీవో సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement