అమ్మవార్లకు ఆషాఢం సారె సమర్పణ | - | Sakshi
Sakshi News home page

అమ్మవార్లకు ఆషాఢం సారె సమర్పణ

Aug 12 2026 3:22 AM | Updated on Aug 12 2026 3:22 AM

సారె సమర్పిస్తున్నారు.

సంప్రదాయాలకు పెద్ద పీట

తెలుగు సంప్రదాయంలో భాగమైన అమ్మవార్లకు సారె సమర్పించే విషయంలో ఆ సంప్రదాయాన్ని కొనసాగించాలని అందుకు తనవంతు కృషి చేస్తానని రాయగడ ఎమ్మెల్యే అప్పలస్వామి కడ్రక అన్నారు. స్థానిక రైతుల కాలనీ ప్రజలు మంగళవారం తుబాటి రాము ఆధ్వర్యంలో అమ్మవార్లకు సారె సమర్పించే కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. మహిళలు సారె ఊరేగింపుగా తీసుకువస్తున్న కార్యక్రమంలో పాల్గొన్నారు. మజ్జిగౌరీ మందిరంలొ ప్రత్యేక పూజలు చేసి సారె సమర్పించారు. అనంతరం మాట్లాడుతూ.. సంస్కృతి, సంప్రదాయాలకు పుట్టినిల్లుగా గుర్తింపు పొందిన మన రాష్ట్రంలో వాటిని తు.చ. తప్పకుండా పాటించాలన్నారు. భిన్న సంస్కృతులు గల మన రాష్ట్రంలో వారి వారి సంస్కృతి, సంప్రదాయాలను కొనసాగించి భావితరాలకు మార్గదర్శకులుగా నిలవాలని పిలుపునిచ్చారు.

రాయగడ: పట్టణ ప్రజలు తమ ఇంటి ఆడపడుచుగా భావించి అమ్మవార్లకు ఆషాఢ మాసం సారె సమర్పణ కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. మరో రెండు రోజుల్లో ఆషాఢ మాసం ముగిస్తున్న నేపథ్యంలో పట్టణ ప్రజలు పోటాపోటీగా సారెలను సమర్పించడంలో నిమగ్నమయ్యారు. ఇందులో భాగంగా స్థానిక రైతుల కాలనీ, మంకడజోల ప్రాంతం, సంపత్‌ వినాయక్‌ నగర్‌ కాలనీలకు చెందిన మహిళలు అమ్మవార్లకు అత్యంత ప్రీతికరమైన రోజుగా భావించే మంగళవారం పట్టణ ప్రజల ఇలవేల్పు, గ్రామదేవతగా పూజలందుకుంటున్న బురదల పోలమ్మ, ఉత్కళాంధ్రుల ఆరాధ్య దైవం మజ్జిగౌరీ అమ్మవార్లకు సారెను సమర్పించారు. ఏటా ఆషాఢ మాసంలో అమ్మవార్లకు సారె సమర్పించడం ఆనవాయితీ. ఈ నేపథ్యంలో తామంతా సుభిక్షంగా ఉండాలని కోరుకుంటూ అమ్మవార్లకు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement