సొంత ఖర్చుతో వంతెన నిర్మాణం | - | Sakshi
Sakshi News home page

సొంత ఖర్చుతో వంతెన నిర్మాణం

Aug 11 2026 1:48 AM | Updated on Aug 11 2026 1:48 AM

రాయగడ: ప్రభుత్వాలు ఆదుకోలేదు. అధికారులు పట్టించుకోలేదు. ఎన్నిసార్లు తమ సమస్యను వారి దృష్టికి తీసుకువెళ్లినా పట్టించుకునే నాథుడే కరువయ్యాడు. దీంతో తమ గ్రామాలకు వంతెన నిర్మాణం కాకపొవడంతో చివరకు ఓ దంపతులు మానవతా ధృక్పథంతో ముందుకు వచ్చారు. తమ సొంత ఖర్చుతో సుమారు రూ.3.70 లక్షలు వెచ్చించి వంతెన నిర్మించి ఏడు గ్రామాల ప్రజలకు రాకపోకల కష్టాలను కొంత మేర తీర్చారు. జిల్లాలోని కాశీపూర్‌ సమితి గొడిబల్లి పంచాయతీ పరిధిలోని పణసగుడ–పుషఘాటి గ్రామాల మధ్య దుయిముహ నందిపై ఈ వంతెన నిర్మించారు. ఈ పంచాయతీలోని పణసగుడ, కుటింగ, పుషగాటి, గొరిలిమా, ఘురిచర, గాడరాముహి గ్రామాలతొ పాటు కళ్యాణసింగుపూర్‌ సమితిలొని సింగపటా గ్రామాలకు ఈ వంతెన ఉపయోగపడుతుంది. ఇక్కడ వంతెన లేక స్థానికులు ఏళ్లుగా ఇబ్బంది పడుతుండడంతో పణసగుడ గ్రామానికి చెందిన దంపతులు శ్యామధర్‌ మాఝి, వసంతి మాఝిలు సొంత ఖర్చుతో వంతెన నిర్మించారు. శ్యామధర్‌ మాఝి రాయగడలో సమితి గుమ్మ పంచాయతీలో ఏడీఈఒగా విధులు నిర్వహిస్తుండగా అతని భార్య వాసంతి మాఝి కాశీపూర్‌ సమితి గొడిబాలి పంచాయతీలో ఎంబీకేగా పనిచేస్తున్నారు. గ్రామస్తులు కూడా శ్రమదానం చేశారు.

వాసంతీ

మాఝి

శ్యామ్‌ ధర్‌ మాఝి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement