పర్లాకిమిడి: గజపతి జిల్లా నువాగడ సమితి కార్యాలయంలో సోమవారం నిర్వహించిన గ్రీవెన్స్ సెల్‌కు వినతులు వెల్లువెత్తాయి. జిల్లా కలెక్టర్ అక్షయ సునీల్ అగర్వాల్, జిల్లా ఎస్పీ ప్రహ్లాద సహాయ్ మీనా, జిల్లా పరిషత్ అదనపు కార్యనిర్వాహణ అధికారి పృథ్వీరాజ్ మండల్, సబ్ కలెక్టర్ అనుప్ పండా తదితరులు హాజరయ్యారు. 30 వినితులు అందాయి. వీటిలో 10 వ్యక్తిగతం, 20 గ్రామ సమస్యలకు సంబంధించినవి ఉన్నాయి. రెండు అభియాగాలను కలెక్టర్ అక్కడికక్కడే పరిష్కరించగా.. మిగతా వినతులను సంబంధిత శాఖ అధికారులు వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు. ఇద్దరు లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి రూ.20వేల ఆర్థిక సహాయాన్ని కలెక్టర్ అందజేశారు. ఏడుగురు వృద్ధులకు జిల్లా సామాజిక, దివ్యాంగుల స్వశక్తీకరణ విభాగం ద్వారా మధుబాబు పింఛన్లను కలెక్టర్ అందజేశారు. నువాగడ పంచాయతీ సమితి చైర్మన్ మాలతీ ప్రధాన్, బీడీఓ లోకనాథ శోబోరో, తహసీల్దార్ మొనాలిసా ఆచారి, డి.ఎస్.ఎస్.ఓ ఉత్సర్‌గితా బోడోరయి, జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు.
63 వినతుల స్వీకరణ..
మల్కన్‌గిరి: మల్కన్‌గిరి జిల్లా మాత్తిలి సమితి బేజాగూడ పంచాయతీ కార్యాలయంలో సోమవారం జిల్లా కలేక్టర్ ప్రధమేశ్ ఆదేశాల మేరకు జిల్లా పరిషత్ ముఖ్య అభివృద్ధి శాఖ అధికారి దశరథి సరాబు అధ్యక్షతన గ్రీవెన్స్ సెల్ నిర్వహించారు. 64 వినతులు స్వీకరించారు. 23 వ్యక్తిగత, 41 సాముహిక సమస్యలకు సంబంధించిన వినతులు అందాయి. ఒక ఫిర్యాదుఅక్కడికడే పరిష్కరించారు. మిగిలిన సమస్యలను త్వరలోనే పరిష్కరిస్తామన్నారు. ఎస్పీ వినోద్ పటేల్, సబ్ కలెక్టర్ దూర్యోధన్ బోయి, మాత్తిలి సమితి అధికారి ప్రమోద్ కుమార్ బెహర, అధికారులు, ఉద్యోగులు పాల్గొన్నారు.


