సొంత భవనం నిర్మించాలని సభ్యుల సూచన
పర్లాకిమిడి: స్థానిక రాజవీధిలోని కోపరేటివ్ అర్బన్‌బ్యాంకుకు ఇప్పటివరకూ సొంత భవనం లేనందున తక్షణమే నిర్మాణం చేయాలని బ్యాంకు మాజీ అధ్యక్షులు అభిమన్యు పండా కోపరేటివ్ బ్యాంకు శతవార్షిక సమావేశంలో ప్రస్తావించారు. అలాగే ప్రజలకు హౌసింగ్ లోన్, బడ్జెట్, ఆర్‌బీఐ. రిపోర్టు, ఆర్థిక లావేదేవీలు కూడా ఆయన ప్రస్తావించారు. ఈ శతవార్షిక సమావేశంలో స్థానిక జంగంవీధి సింహాద్రి ఫంక్షన్ హాలులో శనివారం ఉదయం జరిగింది. పురాతన అర్బన్ కోపరేటివ్ బ్యాంకు శతవార్షిక సమావేశంలో అప్పటి మాజీ అధ్యక్షులు స్వర్గీయ ఐ.సాంబశివరావు, మాజీ అధ్యక్షులు ఎ.శంకర్ రావుల సంస్మరణార్ధం ఐదు నిమిషాలు సభ్యులు మౌనం పాటించారు. బ్యాంకు యువ డైరెక్టర్ ఆదర్శదాస్ అతిధి పరిచయం, స్వాగత ఉపన్యాసం చేయగా, ఈవో, కార్యదర్శి పంకజ నాయక్ బ్యాంకు వార్షిక పట్టిక, ఆదాయం, వ్యయం చదివి వివరించారు. ప్రస్తుతం బ్యాంకు ఆర్థిక పరిస్థితి మెరుగైందని అన్నారు. మాజీ డైరెక్టర్లు ప్రదీప్ నాయక్, దిలీప్ దాస్, వి.వి.రమణమూర్తి పంతులు, అభిమన్యుపండా, దేవేంద్రదాస్‌లను బ్యాంకు అధికారులు సన్మానించారు. కార్యక్రమంలో కౌన్సిలరు, ఉపాధ్యక్షులు ఎ.అమ్ములమ్మ, డైరెక్టర్ జమాదార్ పట్నాయక్, లక్ష్మీకాంత పోరిచ్చా, డి.అప్పారావు, గీతాంజలి పండా ఉన్నారు.


