కొరాపుట్: స్కూల్ గోడ కూలి ఇద్దరు విద్యార్థులు తీవ్ర గాయాలయ్యాయి. గురు వారం కొరాపుట్ జిల్లా నందపూర్ సమితి కశంధి పంచాయతీ కేంద్రంలో ప్రభుత్వ ప్రాధమిక పాఠశాలలో ప్రధాన ద్వారంతో పాటు గోడ కూలింది. గోడ శిధిలాలు కింద ఒకటి, రెండవ తరగతి విద్యార్థులు చిక్కుకు పోయారు. వెంటనే స్థానికులు బాలలలను వెలికి తీశారు. వారిలో బుల్ ఖిల్, ఆయుష్ ఖిల్ అనే ఇద్దరు బాలలకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే వారిని సమీప నందపూర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రమాద విషయంపై స్కూల్ సిబ్బంది ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చారు.


