రాయగడ: పదో తరగతి బోర్డు పరీక్షలు విద్యార్థుల జీవితంలో కీలకమైన మలుపు అని, భయం లేకుండా ఆత్మవిశ్వాసం, క్రమశిక్షణ, లక్ష్య సాధనతో కృషి చేస్తే విజయానికి చేరువవుతారని ఝార్సుగుడ జిల్లా ఎస్పీ జి.ఆర్.రాఘవేంద్ర అన్నారు. జిల్లా విద్యాశాఖ, టాటా క్రొసాకి రిఫ్రాక్టరీస్ లిమిటెడ్ సంయుక్తంగా బెల్‌పహర్‌లో నిర్వహించిన ఉన్మేషా– సపొర్టీవ్ లెర్నింగ్ ప్రాగ్రామ్‌లో ముఖ్య అతిఽథిగా పాల్గొని మాట్లాడారు. పదో తరగతి బోర్డు పరీక్షలను సానుకూల దృక్పథంతో ఎదుర్కొవాలని, లక్ష్యంపై పూర్తి దృష్టిపెట్టి సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. కష్టపడి చదవడం, పట్టుదల, మంచి వ్యక్తిత్వం, పరీక్షల సమయంలో శారీరక, మానసిక ఆరోగ్యాన్ని కాపాడుకోవడం కూడా విజయానికి ఎంతో తొ దొహదపడుతుందన్నారు. విద్యార్థుల్లో పరీక్షల పట్ల ఉన్న భయాన్ని తొలగించి, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించేలా జరిగిన ఈ ఇంటారాక్టివ్ కార్యక్రమాన్ని వారికి కొత్త ఉత్సాహాన్ని ఇచ్చింది.


