విద్యార్థిని దివ్యకు కన్నీటి వీడ్కోలు | - | Sakshi
Sakshi News home page

విద్యార్థిని దివ్యకు కన్నీటి వీడ్కోలు

Oct 7 2024 2:10 AM | Updated on Oct 8 2024 11:31 AM

-

విజయవాడరూరల్‌: ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లి గత నెల 29వ తేదీన గుండెనొప్పితో హఠాన్మరణం చెందిన అవుతు దివ్య మృతదేహం శనివారం రాత్రి కార్గో విమానంలో గన్నవరం విమానాశ్రయానికి వచ్చింది. అక్కడ నుంచి ఆమె కుటుంబ సభ్యులు అంబులెన్స్‌లో మృతదేహాన్ని స్వగ్రామం నున్న తీసుకొచ్చి ఆదివారం అంత్యక్రియలు నిర్వహించారు. నిండు నూరేళ్ళు ఆనందంగా జీవిస్తుందనుకున్న దివ్యను విగతజీవిలా చూడాల్సి వచ్చిందని ఆమె తల్లిదండ్రులు అవుతు సురేంద్రరెడ్డి, స్వప్న, కుటుంబసభ్యులు కన్నీటి పర్యంతమయ్యారు. 

దివ్యతోపాటు చదువుకున్న విద్యార్థినులు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో వచ్చి ఆమె మృతదేహానికి నివాళులర్పించారు. అంత్యక్రియల కోసం ప్రత్యేక వాహనంపై ఊరేగింపుగా తీసుకెళ్లగా గ్రామస్తులు కన్నీటి వీడ్కోలు పలికారు. ఉప సర్పంచ్‌ కలకోటి బ్రహ్మానందరెడ్డి, మాజీ ఎంపీపీ యర్కారెడ్డి నాగిరెడ్డి, సొసైటీ మాజీ చైర్మన్‌ పోలారెడ్డి చంద్రారెడ్డి, బుజ్జి, ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావ్‌ సోదరుడు సతీష్‌, కోటిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement