వజ్రాల వేటకు వచ్చి వ్యక్తి మృతి | - | Sakshi
Sakshi News home page

వజ్రాల వేటకు వచ్చి వ్యక్తి మృతి

Oct 12 2023 4:38 AM | Updated on Oct 12 2023 10:37 AM

- - Sakshi

నందిగామ(చందర్లపాడు): పొరుగు రాష్ట్రం నుంచి వజ్రాల వేట కోసం వచ్చి ఒక వ్యక్తి అనుమానాస్పద మృతి చెందిన ఘటన ఎన్టీఆర్‌ జిల్లా చందర్లపాడు మండలంలో చోటుచేసుకుంది. చందర్లపాడు ఎస్‌ఐ రామకృష్ణ తెలిపిన సమాచారం ప్రకారం.. తెలంగాణ రాష్ట్రం నాగార్జునసాగర్‌కు చెందిన ఇస్రం రాంబాబు (40) ఆటో డ్రైవర్‌గా పని చేస్తాడు. చందర్లపాడు మండలం గుడిమెట్ల అటవీ ప్రాంతంలో కొంతకాలంగా వజ్రాల వేట పేట కొనసాగుతున్న సంగతి పాఠకులకు విదితమే.

ఈ క్రమంలో రాంబాబు కూడా వజ్రాలు అన్వేషించేందుకు గత మూడు రోజుల క్రితం గుడిమెట్ల వచ్చాడు. బుధవారం వజ్రాల వేటకు వచ్చిన కొందరు రాంబాబు మృతి చెంది ఉండడాన్ని గమనించారు. వెంటనే పోలీసులకు సమాచారమివ్వడంతో చందర్లపాడు పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి మృతదేహాన్ని పరిశీలించడంతోపాటు ఆధారాలు సేకరించే పనిలో నిమగ్నమయ్యారు.వజ్రాల వేటకు వచ్చిన వ్యక్తి హత్యకు గురయ్యాడా? లేదంటే ఇంకేదైనా కారణాల వల్ల మృతి చెందాడా అనే అంశాలపై దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement