అమెరికాలో భారీ కారు ర్యాలీ

NRI BRS Supporters Car Rally At Dallas USA - Sakshi

తెలంగాణ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ పార్టీ గెలుపునకు మద్దతుగా అమెరికాలో భారీ కారు ర్యాలీ నిర్వహించారు. బీఆర్‌ఎస్‌ పార్టీ ఎన్నారై వింగ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పార్టీ అభిమానులు, ప్రవాసులు భారీగా తరలివచ్చారు. డల్లాస్‌లో అభిషేక్ కొత్తూరు సారథ్యంలో జరిగిన ర్యాలీకి అనుహ్య స్పందన వచ్చింది. ‘గులాబీ జెండలే రామక్క’ పాటలు, 'అపుడు ఎట్ల ఉండే తెలంగాణ.. ఇప్పుడు ఎట్ల ఉండే తెలంగాణ' అంటూ తీన్మార్ డబ్బులతో సందడి చేశారు.

తెలంగాణలో బీఆర్‌ఎస్‌ పార్టీ గెలుపునకు మద్దతుగా ఈ భారీ కారు ర్యాలీ నిర్వహించినట్లు అభిషేక్ పేర్కొన్నారు. కేసీఆర్‌ నాయకత్వంలో తెలంగాణ దేశానికే రోల్‌ మోడల్‌గా నిలిచిందని, అన్ని రంగాల్లో రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలిపారని కొనియాడారు. ఎన్నారైలంతా సీఎం కేసీఆర్‌, మంత్రులు కేటీఆర్‌కు మద్దతుగా నిలుస్తున్నారని తెలిపారు.

(చదవండి: అగ్రరాజ్యంలో అంబరాన్నంటిన దీపావళి సంబరాలు!)

Read latest NRI News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top