కెనడాలో ఒక ప్రవాస భారతీయ మహిళ ఓవర్ యాక్షన్ నెట్టింట తీవ్ర చర్చకు దారి తీసింది. తన ఇంట్లో అద్దెకి ఉంటున్న వ్యక్తిపై అనుచితంగా ప్రవర్తించిన వైనం కలకలం రేపింది. దీంతో చిర్రెత్తుకొచ్చిన అతను పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ వివాదానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన కెనడాలోని సరీ నగరంలో చోటు చేసుకుంది. అసలేం జరిగింది అంటే.
కెనడాలో నివసిస్తున్న రాజ్ తివానా అనే భారతీయ మహిళ, తన అద్దెదారుడితో వాగ్వాదానికి దిగింది. ఆ ఇంట్లోని తోటలో తన స్నేహితుడితో కలిసి బార్బెక్యూలో బీఫ్ వండడాన్ని తివానా అభ్యంతరం చెప్పడంతో వివాదం షురూ అయింది. తన ఇంటిని, గోడల్ని పాడు చేస్తున్నారని ఆరోపిస్తూ వారితో గొడవకు దిగింది. అక్కడితో ఆగలేదు ఒక కర్ర ముక్కను తీసుకుని గ్రిల్ పైనుంచి ఆహారాన్ని తోసేసింది.
ఆ తరువాత ఇంట్లోకి చొరబడి మరీ ఆమె రాయితో దాడిచేసింది. మస్కిటో బ్యాట్‌తోనూ ఎటాక్ చేసింది. తన యూనిట్ నుంచి వెళ్లిపోమని పదేపదే దూషించడం, అతడిపై ఎటాక్ చేయడం లాంటివి వీడియోలు రికార్డైనాయి. దీంతో బాధితుడు తన యజమానురాలు పదేపదే వేధిస్తోందని, తన పనుల్లో జోక్యం చేసుకుంటోందని ఆరోపిస్తూ వరుస వీడియోలను పోస్ట్ చేశాడు.
ఇదీ చదవండి: జొమాటో కస్టమర్ల నెత్తిన పిడుగు, భారీ షాకిచ్చిందిగా!
An Indian woman in Canada clashed with her tenant after objecting to him using a barbecue in the garden with a friend on her property. After a video of their altercation went viral, the man shared a series of clips alleging that the incident was part of a larger pattern of… pic.twitter.com/vGMtZnVSmZ
— Hate Detector 🔍 (@HateDetectors) September 12, 2026
తన గదిని ఖాళీ చేసి వెళ్లాలని వేడుకుంటున్నావినలేదంటూ మరో వీడియో షేర్ చేశాడు. ముందస్తు సమాచారం లేకుండానే లోపలికి వచ్చి తాళాలు మార్చేయడమే కాకుండా, చివరకు అతని ఇంటి ప్రధాన తలుపునే పూర్తిగా తొలగించిందని ఆవేదన వ్యక్తం చేశాడు. ఇంకో వీడియోలో కొంతమంది పురుషులు ఆ ప్రాంగణంలోకి ప్రవేశించడం, ఘర్షణ పడటం కూడా రికార్డైంది. అతని ఫిర్యాదు మేరకు ఈ సంఘటనకు సంబంధించి తివానాను అరెస్టు చేసినట్టు కూడా ఈ వీడియోల ద్వారా తెలుస్తోంది.
ఇదీ చదవండి: నటి అమీషా తల్లి డైమండ్ నగలు చోరీ : పనిమనిషి అరెస్ట్
Landlord and tenant disputes in Canada are rampant specifically in Punjabi dominated areas and properties; however this incident between Raj Tiwana and her tenant has turned the conversation exceedingly factional; entire incident is being seen from a highly racists point of view… pic.twitter.com/YKQnx07R0v
— Arshdeep Singh Saini (@the_lama_singh) September 12, 2026
అయితే ఈ ఘటనలో అసలు వివాదానికి కారణాలపై స్పష్టత లేదు. అలాగే దాడికి సంబంధించిన పూర్తి వివరాలు, పోలీసులు నమోదు చేసిన అభియోగాలు తదితర అంశాలపై క్లారిటీ లేదు.
ఇదీ చదవండి : రూ. 250లతో చెట్టు కింద ఉచిత స్కూలు: KBC 18 కంటెస్టెంట్ ఇంట్రస్టింగ్ స్టోరీ


