మళ్లీ అక్రమాలు.. | - | Sakshi
Sakshi News home page

మళ్లీ అక్రమాలు..

Sep 25 2026 1:53 AM | Updated on Sep 25 2026 1:53 AM

● వాణిజ్య పన్నుల శాఖలో కొందరి

బినామీ దందాలు

● ఉన్నతాధికారులకు లేఖలు రాసిన

శాఖ ఉద్యోగులు

నిజామాబాద్‌అర్బన్‌: వాణిజ్య పన్నుల శాఖలో అక్రమాల ఆరోపణలు మళ్లీ వెల్లువెత్తుతున్నాయి. గతంలో బోధన్‌ కేంద్రంగా నకిలీ బిల్లుల వ్యవహారం రా ష్ట్ర వ్యాప్తంగా సంచలం సృష్టించింది. రూ.300 కోట్లు ప్రభుత్వానికి ఎగ్గొట్టి అక్రమాలకు పాల్పడ గా.. బాధ్యులను అరెస్టు చేసి జైలుకు పంపించారు. మళ్లీ అదే శాఖలోని కొందరు ఉద్యోగులు బినామీ దందాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. కొందరు ఉద్యోగులు అధికారాన్ని అడ్డం పెట్టుకొని అక్రమాలకు పాల్పడుతున్నారని, దీనిపై ఆ శాఖలోని పలువురు ఉద్యోగులు వాణిజ్య పన్నుల శాఖ ఉన్నతాధికారులతోపాటు కలెక్టర్‌కు లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేయడం గమనార్హం.

బినామీ పేర్లతో..

గత కొన్నేళ్లుగా ఇక్కడే వాణిజ్య పన్నులశాఖలో కొనసాగుతున్న కొందరు ఉద్యోగులు బినామీ పేర్లతో ఐరన్‌ వ్యాపారం చేస్తున్నారు. ఎనిమిది చోట్ల వ్యా పారాలు చేస్తున్న వీరు ప్రభుత్వానికి కట్టాల్సిన కో ట్లాది రూపాయల జీఎస్టీని ఎగవేస్తున్నారు. మరికొందరు ఉద్యోగులకు వ్యాపారులకు సహకరిస్తున్నారనే ఆరోపణలున్నాయి. గతంలో బోధన్‌ స్కా మ్‌లో నిందితుడిగా ఉన్న వ్యక్తి ఇప్పుడు కూడా ఐరన్‌, ఐరన్‌ స్క్రాప్‌ వాహనాలను అనుమతిస్తూ ప్రతి నెలా లక్షలాది రూపాయల ముడుపులు దండుకుంటున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. గత కొన్ని సంవత్సరాలుగా జిల్లా కేంద్రంలోనే ఉంటూ పదోన్నతి పొంది ఇక్కడే కొనసాగుతున్న ఒకరితోపాటు మరో ఇద్దరు అధికారులు అక్రమాల వ్యవహారానికి తెరలేపారు. అక్రమాలను ప్రశ్నిస్తే బెదిరిస్తున్నారని మిగతా ఉద్యోగులు వాపోతున్నారు. అ క్రమార్కులైన అధికారుల సహకారంతోనే మెదక్‌ జి ల్లా చేగుంటలోని ఓ ప్రాంతం నుంచి జిల్లాకు ప్రతి రోజూ 10 నుంచి 15 వాహనాలు ఐరన్‌ సరఫరా చేస్తున్నాయని, అలాగే మహారాష్ట్ర నుంచి 14 వాహనాలు నిజామాబాద్‌కు ప్రతిరోజూ ఐరన్‌, ఐరన్‌ స్క్రాప్‌ తీసుకొస్తున్నాయని తెలుస్తోంది. వ్యాపారుల అక్రమాలకు సహకరిస్తూనే సదరు అధికారులు జిల్లా కేంద్రంలోని బోధన్‌ రోడ్డులో రెండు, ఆర్మూర్‌ రోడ్‌లో మరో మూడు వ్యాపార సముదాయాలను బినామీ పేర్లతో కొనసాగిస్తున్నారు. కామారెడ్డిలోనూ రెండు వ్యాపార సముదాయాలుతోపాటు మహారాష్ట్ర, చేగుంట, మెదక్‌ ప్రాంతాల్లో వీరికి బినామీ పేర్లతో ఐరన్‌ దుకాణాలు ఉన్నట్లు సమాచారం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement