● మీడియా అకాడమీ కార్యదర్శి
వెంకటేశ్వరరావు
కామారెడ్డి క్రైం: బాన్సువాడలోని ఎస్‌ఆర్‌ఎన్‌కే ప్ర భుత్వ డిగ్రీ కళాశాలలో ఈనెల 29, 30 తేదీల్లో జర్నలిస్టులకు శిక్షణ ఇవ్వనున్నట్లు తెలంగాణ మీడియా అకాడమీ కార్యదర్శి వెంకటేశ్వరరావు తెలిపారు. గు రువారం కలెక్టరేట్‌కు వచ్చిన ఆయనకు కలెక్టర్ ఆ శిష్ సంగ్వాన్ స్వాగతం పలికారు. ఈ సందర్భంగా వెంకటేశ్వరరావు మాట్లాడుతూ సమాచార హక్కు చట్టం, తప్పొప్పుల పరిశీలన, నేర వార్తల కవరేజ్, వార్తా కథనాల రూపకల్పన, వార్తా సేకరణ, వార్తల ప్రాధాన్యత నిర్ణయం, వాస్తవ నిర్ధారణ, మీడియా చట్టాలు–నైతిక నియమాలు, జర్నలిజంలో పాటించాల్సిన వృత్తిపరమైన ప్రమా ణాలు తదితర అంశాలపై జర్నలిస్టులకు శిక్షణ ఇవ్వనున్నామన్నారు. స మావేశంలో అదనపు కలెక్టర్ ఎన్‌వై గిరి, మీడియా అకాడమీ చైర్మన్ ఓఎస్డీ రహ్మాన్, మేనేజర్ శైలేష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఏర్పాట్ల పరిశీలన..
బాన్సువాడ : బాన్సువాడలోని ఎస్‌ఆర్‌ఎన్‌కే ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో నిర్వహించే వర్క్ షాప్ ఏర్పాట్లను గురువారం మీడియా అకాడమీ కార్యదర్శి పరిశీలించారు. ఈనెల 29, 30 తేదీల్లో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు జర్నలిస్టులకు శిక్షణ తరగుతులు ఉంటాయని పేర్కొన్నారు. శిక్షణకు హాజరయ్యే జర్నలిస్టులకు మెటీరియల్, సర్టిఫికెట్లు అందజేస్తామన్నారు. ఆయన వెంట టీయూడబ్ల్యూజే జిల్లా అధ్యక్షుడు రజినీకాంత్, కళాశాల ప్రిన్సిపల్ గంగాధర్, వర్క్‌షాప్ నిర్వహణ కమిటీ సభ్యులు ఉన్నారు.


