మద్నూర్‌లో అవగాహన కల్పిస్తున్న సీడీపీవో.. చిన్న టాక్లీ గ్రామంలో..
మద్నూర్(జుక్కల్): డోంగ్లి మండలంలోని చిన్న టాక్లీ లోని అంగన్‌వాడీ కేంద్రంలో గురువారం పోషణమాసంలో భాగంగా తల్లులు, గర్భిణులు, బాలింతలకు క్విజ్ పోటీలు నిర్వహించారు. ఐసీడీఎస్ సీడీపీవో కళా వతి మాట్లాడుతూ.. పుట్టిన బిడ్డకు గంటలోపు తప్పకుండా ముర్రుపాలు తాగించాలన్నారు. గర్భిణులు, బాలింతలు హిమోగ్లోబిన్ పెరుగుదల కోసం ఐరన్ మాత్రలు తీసుకోవాలన్నారు. మద్నూర్ మండల కేంద్రంలోని గణేశ్ మండపం వద్ద పోషణ మాస సంబరాలు నిర్వహించారు. కార్యక్రమంలో అంగన్‌వాడీ టీచర్లు సచిత, కళావతి, చంపా, తల్లులు పాల్గొన్నారు.
వెంకటాపూర్‌లో సామూహిక సీమంతాలు
ఎల్లారెడ్డిరూరల్: మండలంలోని వెంకటాపూర్ గ్రామంలోని అంగన్‌వాడీ కేంద్రంలో గురువారం సామూహిక సీమంతాలు నిర్వహించారు. గర్భిణులకు అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా పౌష్టికాహారం అందిస్తున్నట్లు సర్పంచ్ సాయిలు అన్నారు. కార్యక్రమంలో అంగన్‌వాడీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.


