బాన్సువాడ: బాన్సువాడ ప్రభుత్వ ఆస్పత్రిలో వి ధులు నిర్వహించే వైద్యుడు సీను నాయక్ మూడు రోజుల నుంచి అనారోగ్యానికి గురయ్యారు. ప్రతీ రోజు రాత్రి వేళల్లో విధులు నిర్వహిస్తున్నారు. వి విధ ప్రాంతాల నుంచి వచ్చే రోగులకు వైద్య సేవలందించడంలో ఆటంకం ఏర్పడకుండా ఉండేందుకు అనారోగ్యానికి గురైనా డ్యూటీ వేయించు కుని సెలన్ పెట్టుకుని మరీ విధులకు హాజర య్యారు. సిబ్బంది సెలన్ పట్టుకుని వైద్యుడి వెంట తిరుగుతూ ఆస్పత్రికి వచ్చే రోగులకు వైద్య సేవందించారు. రోగుల కుటుంబ సభ్యులు వైద్యుడి తీరుపై సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.


