విద్యార్థులు సమాజసేవలో ముందుండాలి | - | Sakshi
Sakshi News home page

విద్యార్థులు సమాజసేవలో ముందుండాలి

Sep 25 2026 2:17 AM | Updated on Sep 25 2026 2:17 AM

తెయూ(డిచ్‌పల్లి): విద్యార్థులు చదువుతోపాటు స మాజ సేవలో ముందుండాలని తెలంగాణ యూనివర్సిటీ రిజిస్ట్రార్‌ యాదగిరి అన్నారు. యూనివర్సిటీలో గురువారం జాతీయ సేవా పథకం (ఎన్‌ఎస్‌ఎస్‌) ఆధ్వర్యంలో ఎన్‌ఎస్‌ఎస్‌ డే వేడుకలను ఘ నంగా నిర్వహించారు. కార్యక్రమానికి ఆయన ము ఖ్యఅతిథిగా హాజరై, మాట్లాడారు. 1969 సెప్టెంబర్‌ 24న‘సేవ ద్వారా విద్య’ అనే భావనకు మూలస్ఫూర్తిగా ఎన్‌ఎస్‌ఎస్‌ ప్రారంభమైందన్నారు. విద్యార్థులు తరగతి గదిలో పొందిన జ్ఞానాన్ని సమాజ సేవకు అన్వయించాలని ఆయన సూచించారు. ఎన్‌ఎస్‌ఎస్‌ ద్వారా యువతలో సేవాభావం, సామాజి క బాధ్యత,నాయకత్వ లక్షణాలు పెంపొందుతాయన్నారు.అనంతరం ఆరు ఎన్‌ఎస్‌ఎస్‌ యూనిట్ల వ లంటీర్లకు వివిధ పోటీలు నిర్వహించగా, విజేతల కు బహుమతులు అందజేశారు. జిల్లా యువజన అ ధికారి రమేష్‌,తెయూ ఎన్‌ఎస్‌ఎస్‌ ప్రోగ్రామ్‌ కోఆర్డి నేటర్‌ అపర్ణ, ప్రొఫెసర్లు సీహెచ్‌ ఆరతి, రాంబాబు, అంద జీవన్‌ రావు, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement