కామారెడ్డిలో ఘనంగా గణేశ్‌ నిమజ్జనం | - | Sakshi
Sakshi News home page

కామారెడ్డిలో ఘనంగా గణేశ్‌ నిమజ్జనం

Sep 25 2026 2:17 AM | Updated on Sep 25 2026 2:17 AM

కామారెడ్డి టౌన్‌: నవరాత్రులు విశేష పూజలందుకున్న బొజ్జ గణపయ్య.. గంగమ్మ ఒడికి చేరాడు. కామారెడ్డి జిల్లా కేంద్రంలో బుధవారం రాత్రి ప్రారంభమైన వినాయక విగ్రహాల నిమజ్జన శోభాయాత్ర గురువారం కనులపండువగా సాగింది. వరుసగా కదులుతున్న గణనాథులను చూడడానికి వేలాది మంది తరలివచ్చారు. దీంతో పట్టణం జనసంద్రంగా మారింది. నిమజ్జనం జరిగే టేక్రియాల్‌ పెద్ద చెరువు వద్ద మున్సిపల్‌, రెవెన్యూ, విద్యుత్‌ శా ఖల ఆధ్వర్యంలో పటిష్ట ఏర్పాట్లు చేశారు. నిమజ్జన ప్రక్రియ వేగవంతంగా పూర్తయ్యేలా భారీ క్రేన్లు, డోజర్లను అందుబాటులో ఉంచారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చెరువు లోతు ప్రాంతాల వద్ద మున్సిపల్‌ సిబ్బంది, గజ ఈతగాళ్లు అందుబాటులో ఉన్నారు. శోభాయాత్ర, నిమజ్జనం ప్రశాంత వాతావరణంలో ముగిసేలా జిల్లా పోలీస్‌ యంత్రాంగం పకడ్బందీ బందోబస్తు నిర్వహించింది. టేక్రియల్‌ చెరువు వద్ద ఏర్పాట్లను కలెక్టర్‌ ఆశిష్‌ సంగ్వాన్‌ పరిశీలించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement