● రైతులను ఎలా ఆదుకుంటారో చెప్పాలి
● కాంగ్రెస్, బీజేపీ ఎవరి డబ్బా వాళ్లు కొట్టుకుంటున్నారు
● టీఆర్‌ఎస్ అధ్యక్షురాలు కవిత
నిజామాబాద్‌అర్బన్: జిల్లాలోని అన్ని మండలాల్లో కరువు పరిస్థితులు ఉన్నాయని, రీ సర్వే చేసి మరి న్ని మండలాలను కరువు ప్రాంతాలుగా ప్రకటించాలని టీఆర్‌ఎస్ అధ్యక్షురాలు కవిత కోరారు. జి ల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో బుధవారం ఆమె మీడియాతో మాట్లాడారు. 18 మండలాలను మాత్రమే కరువు మండలాలుగా ప్రకటించడం సరికాదన్నారు. రాష్ట్రానికి కరువు సాయం చేసేలా బీజేపీ ఎంపీలు కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలన్నా రు. కరువు బారిన పడిన రాష్ట్రాన్ని ఆదుకోవాల్సిన ప్రస్తుత సమయంలో కూడా కేంద్రం నుంచి పైసా సాయం అందడం లేదని మండిపడ్డారు. కరువు పేరుతో రైతులను పంటలు వేయొద్దని చెబుతున్న ప్రభుత్వం.. వారిని ఎలా ఆదుకుంటుందో చెప్పాల ని డిమాండ్ చేశారు. ఆరుతడి పంటలు వేస్తే ఎంత ధరకు కొంటారో స్పష్టత ఇవ్వాలన్నారు. ఇప్పటికే యూరియా విషయంలో ఆగమవుతున్న రైతులను మళ్లీ పంటల సాగు విషయంలోనూ గందరగోళానికి గురిచేయడం సరికాదన్నారు. 16వ ఫైనాన్స్ కమిషన్ నిధులు రాకపోవడంతో సర్పంచులు ఇబ్బందులు పడుతున్నారని, స్థానిక బీజేపీ ఎంపీ అర్వింద్ కేంద్రంతో కొట్లాడి 16వ ఫైనాన్స్ కమిషన్ నిధులు వచ్చేలా చేయాలని కోరారు.
ఏకపక్షంగా విలీనమా..
ఇంటర్ విద్యను ఏకపక్షంగా స్కూల్ ఎడ్యుకేషన్‌లో విలీనం చేస్తామంటే ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించేది లేదని కవిత అన్నారు. ఈ అంశంలో కచ్చితంగా విద్యార్థుల తల్లితండ్రులు, స్కూల్, ఇంటర్ కాలేజీల యాజమాన్యాలు, విద్యావేత్తలతో చర్చించాకే నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వానికి సూచించా రు. సమావేశంలో పార్టీ నాయకులు పాల్గొన్నారు.
ఎవరి డబ్బా వారిదే..
కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పాదయాత్రలు చేస్తుంటే.. రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ సమావేశాలు నిర్వహిస్తూ ఎవరి డబ్బా వాళ్లే కొట్టుకుంటున్నారని కవిత విమర్శించారు. ఇకనైనా క్షేత్రస్థాయిలో ప్రజా సమస్యలను తెలుసుకొని వాటి పరిష్కారంపై దృష్టి సారించాలన్నారు.


