కమ్మర్‌పల్లి(భీమ్‌గల్): భీమ్‌గల్ పరిధిలోని లింబాద్రి గుట్ట లక్ష్మీనరసింహస్వామి దివ్య క్షేత్రంలో బుధవారం చక్రతీర్థం కార్యక్రమాన్ని ఆలయ పండితులు భక్తిశ్రద్ధలతో నిర్వహించా రు. శ్రీవారి కల్యాణ మండపం నుంచి స్వా మివారి ఉత్సవ విగ్రహాలతోపాటు చక్రస్వా మివారిని ప్రత్యేకంగా అలంకరించి మంగళవాయిద్యాల మధ్య ఊరేగింపుగా తీసుకెళ్లారు. ఆలయ మాడవీధుల గుండా సాగిన ఊరేగింపు పుష్కరిణి వద్దనున్న కోనేటి మండపానికి చేరుకుంది. అక్కడ స్వామివారి ఉత్సవ విగ్ర హాలను, ఎదురుగా చక్రస్వామివారిని కొలువుదీర్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు. పాలు, తేనె, గంధం, పసుపు, నెయ్యి తదితర పవిత్ర ద్రవ్యాలతో స్వామివారి విగ్రహాలకు అభిషేకం చేశారు. అనంతరం పుష్పాలతో విశేషంగా అలంకరించి హారతి సమర్పించారు. భక్తులు గోవింద నామస్మరణ చేస్తూ స్వామివారిని దర్శించుకున్నారు.
ఖేలో ఇండియా ఆర్చరీ కోచ్‌గా మురళి
ఖలీల్‌వాడి: జిల్లా కేంద్రా నికి చెందిన ఆర్చరీ కోచ్ మురళీ జాతీయస్థాయి ఖే లో ఇండియా ఆర్చరీ పో టీలకు టెక్నికల్ అఫీషియల్‌గా నియమితులయ్యారు. ఈనెల 26 నుంచి 28వ తేదీ వరకు పోలీస్ మీట్ స్పోర్ట్స్ ఆర్చరీ పోటీలు నిజామాబాద్‌లో నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా ఆర్చరీ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అరవింద్‌కుమార్ నియామకపత్రాన్ని విడుదల చేశారు.


