న్యూస్‌రీల్
నిజామాబాద్
కళల్లో విద్యార్థులు..
విద్యతోపాటు కళల్లో విద్యార్థులు పురోగతి సాధించాలని భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు అనుగు నరసింహారెడ్డి అన్నారు.
గురువారం శ్రీ 26 శ్రీ నవంబర్ శ్రీ 2026
– 8లో u
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం అమలు కోసం ప్రభుత్వం ఆన్‌లైన్‌లో దరఖాస్తు ప్రక్రియను ప్రారంభించింది. అయితే క్షేత్రస్థాయిలో ఆన్‌లైన్‌లో దరఖాస్తుల నమోదు ప్రక్రియలో సాంకేతిక ఇబ్బందులు ఎదురవుతున్నాయి. రేషన్‌కార్డు ఉన్న ప్రతి కుటుంబానికి బీమా సౌకర్యం కల్పించాలని ప్రభుత్వం చెబుతున్నా అందరికీ అవకాశం ఉండటం లేదు. సింగిల్‌గా ఉంటున్నవారికి రేషన్‌కార్డు ఉన్నా బీమా నమోదుకు అవకాశం లేదు. 59 ఏళ్లు దాటిన వారిని నామినీగా చేర్చుకోవాలన్నా పోర్టల్ అంగీకరించడం లేదు. బీమా దరఖాస్తు కోసం ప్రత్యక్షంగా హాజరై సంతకం చేయాల్సి రావడంతో ఈ ప్రక్రియ మందకొడిగా సాగుతోంది. డిసెంబర్ 18వ తేదీలోగా ఇందిరమ్మ బీమా దరఖాస్తుల ప్రక్రియను పూర్తిచేయాలని లక్ష్యంగా కాగా.. ఈలోగా అర్హుల దరఖాస్తులను నమోదు చేయడం సవాల్‌గా మారింది.
రేషన్‌కార్డు ఆధారంగా..
రేషన్‌కార్డు లేకపోయినా బీమాకు అవకాశం కల్పిస్తామని ప్రభుత్వం చెప్పినప్పటికీ ప్రస్తుతానికి ఆ నిర్ణయం అమలుకు నోచుకోలేదు. రేషన్‌కార్డు ఉన్నవారికే బీమా కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది. రేషన్‌కార్డు ఆధారంగానే పోర్టల్‌లో దరఖా స్తు ఓపెన్ అవుతోంది. కార్డు నంబర్ నమోదు చేయగానే 18 నుంచి 59 ఏళ్ల లోపు ఉన్న కుటుంబ సభ్యుల పేర్లు చూపుతాయి. వారిలో ఎవరైనా ఒకరి పేరిట బీమా నమోదు చేస్తే మరొకరిని నామినీగా చూపాల్సి ఉంటుంది. అయితే నామినీ వయస్సు 59 ఏళ్లు దాటినా పోర్టల్ స్వీకరించడం లేదు. రేషన్‌కార్డు లేనివారికి ఎప్పుడు అవకాశం కల్పిస్తారన్న దానిపై స్పష్టత లేదు.
ఉన్నట్టా..? లేనట్టా..?
భూమి లేని కుటుంబాలకు సైతం ఇందిరమ్మ బీమా పథకం కింద రూ.5 లక్షల బీమా వర్తిస్తుండడంతో ఆయా కుటుంబాల్లో హర్షం వ్యక్తమవుతోంది. అయితే గతంలో అమలు చేసిన రైతుబీమా పథకం కొనసాగుతుందా లేక నిలిపివేశారా అన్నదానిపై స్పష్టత కరువైంది. రైతుబీమా కింద కుటుంబంలో 59 ఏళ్లలోపు ఎంతమందికి భూమి ఉంటే అందరికీ బీమా అమలయ్యేది. ఒక్కో కుటుంబంలో ఇద్దరు, ముగ్గురికై నా రైతుబీమా వర్తించగా, ప్రస్తుతం ఇందిరమ్మ బీమాతో కుటుంబంలో ఎవరైనా ఒక్కరికే అవకాశం ఉంది.
దరఖాస్తు నమోదు సమయంలో కుటుంబంలో ఎవరైనా రైతుబీమాకు అర్హులు ఉన్నారా? అని అధికారులు అడుగుతున్నారు. దీంతో రైతుబీమా పథకాన్ని ప్రభుత్వం కొనసాగిస్తుందా? లేక ఇందిరమ్మ బీమాకే పరిమితం చేస్తుందా? అన్న చర్చ కొనసాగుతోంది.
దరఖాస్తుకు సాంకేతిక ఇబ్బందులు
కుటుంబానికి ఆర్థిక భద్రత కల్పించడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా నమోదు ప్రక్రియలోనే చిక్కులు ఎదురవుతున్నాయి. రేషన్‌కార్డులో పేర్లున్న ఒకరికి బీమా వర్తిస్తుండగా, మరొకరిని నామినీగా చూపాల్సి ఉంది. ఇక్కడే అసలు సమస్య ఎదురవుతోంది. 59 ఏళ్లు దాటిన వారిని నామినీగా తీసుకోవడం లేదు. అలాగే ఒంటరిగా ఉంటున్న, రేషన్‌కార్డు లేని వారి పరిస్థితి ఏమిటో స్పష్టత లేదు.
ఒంటరిగా ఉన్నవారికి.. 59 ఏళ్లు దాటిన నామినీలకు దక్కని అవకాశం
రేషన్ కార్డు ఉంటేనే ఇందిరమ్మ
బీమాకు అర్హత
ఇన్‌స్యూర్డ్ సంతకం నేపథ్యంలో
నెమ్మదిస్తున్న దరఖాస్తుల ప్రక్రియ
రైతుబీమా కొనసాగింపుపై స్పష్టత కరువు


