షోకాజ్‌ నోటీసు కాదు.. సస్పెన్షనే | - | Sakshi
Sakshi News home page

షోకాజ్‌ నోటీసు కాదు.. సస్పెన్షనే

Nov 26 2026 1:35 AM | Updated on Nov 26 2026 1:35 AM

బోధన్‌: అనుమతి లేకుండా విధులకు గైర్హాజరయ్యే ఉపాధ్యాయులకు ఇక నుంచి షోకాజ్‌ నోటీసులు ఇవ్వకుండా నేరుగా సస్పెన్షన్‌ వేటు వేస్తామని కలెక్టర్‌ ఇలా త్రిపాఠి హెచ్చరించారు. టీచర్లు సమయ పాలన పాటించాలన్నారు. సాలూరలోని పీఎంశ్రీ జెడ్పీహెచ్‌ఎస్‌ను కలెక్టర్‌ బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థులు, ఉపాధ్యాయుల హాజరును పరిశీలించారు. మెనూ ప్రకారం మధ్యాహ్న భోజనం అందిస్తున్నారా లేదా అని ఆరా తీశారు. వి ద్యార్థుల సంఖ్యకు సరిపడా తరగతి గదులు లేవని హెచ్‌ఎం, ఎంఈవో రాజీమంజూష కలెక్టర్‌కు తెలు పగా.. ఐదు అదనపు తరగతి గదులు మంజూరు చేస్తామని అన్నారు. పక్కనే ఉన్న ఉర్డూ మీడియం ప్రాథమికోన్నత పాఠశాలను కలుపుకుని విద్యార్థులకు అనువైన ప్లేగ్రౌండ్‌ అందుబాటులోకి వచ్చే లా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఒకేషనల్‌ కోర్సు ట్రైయినర్లుగా పని చేస్తున్న ఇద్దరు ఉపాధ్యాయులు తమకు ఎనిమిది నెలలుగా వేతనాలు రావడం లేదని కలెక్టర్‌కు తెలిపారు.

లెక్కలు చెప్పిన కలెక్టర్‌

ఎనిమిదో తరగతి గదికి వెళ్లిన కలెక్టర్‌.. విద్యార్థులకు గణిత పాఠాలు చెప్పారు. విద్యార్థులకు ప్రశ్నలు వేసి వారి అభ్యసన సామర్థ్యాలను పరిశీలించారు. విద్యార్థులు సరైన సమాధానాలు చెప్పారు. బాగా చదువుకోవాలని, మళ్లీ వస్తానని కలెక్టర్‌ విద్యార్థులతో అన్నారు.

నేనెవరిని..?

పాఠశాల ప్రాంగణంలోని నాలుగు, ఐదు తరగతుల విద్యార్థులతో కలెక్టర్‌ ఆసక్తికరంగా ముచ్చటించారు. పలువురు విద్యార్థులను పిలిచి మాట్లాడుతుండగా.. గుంపుగా మరికొందరు అక్కడి వచ్చా రు. ఇంత మంది ఎందుకొచ్చారు..? నేను ఎవరిని..? అని కలెక్టర్‌ వారిని ప్రశ్నించగా.. మీరు టీచర్‌ అని విద్యార్థులు బదులిచ్చారు. అక్కడే ఉన్న డీఈవో సాయాగౌడ్‌.. ‘కలెక్టర్‌ మేడం’ అని విద్యార్థులకు చెప్పగా.. కలెక్టరైనా టీచర్‌ ఉంటేనే అని కలెక్టర్‌ వ్యాఖ్యానించారు. తహసీల్దార్‌ అజ్మత్‌ నవాజ్‌, ఉపాధ్యాయులు ఉన్నారు.

గైర్హాజరు ఉపాధ్యాయులపై

కఠిన చర్యలు

సమయపాలన పాటించాలి

కలెక్టర్‌ ఇలా త్రిపాఠి

సాలూర పీఎంశ్రీ జెడ్పీహెచ్‌ఎస్‌

ఆకస్మిక తనిఖీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement