ఆర్మూర్‌టౌన్: విద్యార్థులు చదువుతోపాటు క్రీడల్లో రాణిస్తే మంచి భవిష్యత్ ఉంటుందని సబ్ కలెక్టర్ అభిజ్ఞాన్ మాల్వియా, ట్రెయినీ కలెక్టర్, ఖేలో ఇండి యా నోడల్ అధికారి సురేశ్ అన్నారు. ఆర్మూర్ పట్ట ణంలోని జిల్లా పరిషత్ బాలికల పాఠశాలలో బుధవారం ‘ఖేలో ఇండియా’ క్రీడలకు సంబంధించి టే బుల్ టెన్నిస్ లోగోతోపాటు సెల్ఫీ పాయింట్‌ను ఆ విష్కరించారు. జిల్లా క్రీడల అధికారి పవన్ మాట్లా డుతూ.. రాష్ట్ర ప్రభుత్వం క్రీడలకు అత్యంత ప్రాధాన్యతనిస్తూ ప్రోత్సహిస్తోందన్నారు. ఎంఈవో రవీందర్, హెచ్ఎం వనజ, పీఈటీ గోపిరెడ్డి, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.


