పర్యాటక అభివృద్ధికి కృషి | - | Sakshi
Sakshi News home page

పర్యాటక అభివృద్ధికి కృషి

Sep 25 2026 1:53 AM | Updated on Sep 25 2026 1:53 AM

రేపు ఉమ్మడి జిల్లా స్థాయి అర్చరీ ఎంపికలు తడిహిప్పర్గాలో మద్య నిషేధం

నిజామాబాద్‌ రూరల్‌: జిల్లాలో పర్యాటక రంగ అభివృద్ధికి యువత, ప్రజలు సహక రించాలని జిల్లా పరిషత్‌ సీఈవో సాయా గౌడ్‌ కోరారు. ప్రపంచ పర్యాటక దినోత్సవా న్ని గురువారం జెడ్పీలో నిర్వహించగా ఆ యన ముఖ్య అతిథిగా హాజరై వివిధ పోటీ ల్లో గెలుపొందిన పాఠశాల, కళాశాల విద్యార్థులను అభినందించారు. ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా నిర్వహించే పోటీల్లో విజేతలుగా నిలిచిన వారిని రాష్ట్రస్థాయి పోటీలకు పంపిస్తామని జిల్లా పర్యాటకశాఖ అధికారి పవన్‌కుమార్‌ తెలిపారు. కార్యక్రమంలో పాలిటెక్నిక్‌ కళాశాల అధ్యాపకులు రాఘవేంద్ర, లలిత, సురేశ్‌, గంగాదాస్‌ పాల్గొన్నారు.

జాతీయస్థాయి

బాల్‌బ్యాడ్మింటన్‌కు ఎంపిక

రెంజల్‌: జాతీయస్థాయి బాల్‌బ్యాడ్మింటన్‌ పోటీలకు రెంజల్‌లోని మైనార్టీ గురుకుల పాఠశాల, కళాశాలకు చెందిన తబస్సుమ్‌ ఎంపికై నట్లు ఇన్‌చార్జి ప్రిన్సిపాల్‌ సబా ఆర్షిన్‌ తెలిపారు. ఇటీవల మహబూబ్‌నగర్‌ జిల్లా వనపర్తిలో నిర్వహించిన రాష్ట్రస్థాయి పోటీ ల్లో తబస్సుమ్‌ సత్తాను ప్రదర్శించి జాతీయ పోటీలకు ఎంపికై ందన్నారు. గురువారం త బస్సుమ్‌ను పాఠశాల సిబ్బంది అభినందించారు. ఫిజికల్‌ డైరెక్టర్‌ భాగ్యశ్రీ, వ్యాయామ ఉపాధ్యాయురాలు శ్యామల పాల్గొన్నారు.

జాతీయ సదస్సుకు జిల్లావాసి

నిజామాబాద్‌ రూరల్‌: ఈనెల 25, 26 తేదీల్లో జైపూర్‌లో నిర్వహించనున్న జాతీయ వినియోగదారుల హక్కుల కార్యకర్తల సదస్సుకు హైదరాబాద్‌ నుంచి సీసీఐ(కన్జ్యూమర్‌ కాన్ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా) జాతీయ కార్యదర్శి శంకర్‌లాల్‌ చౌరాసియా, జిల్లా నుంచి వినియోగదారుల మండలి సౌత్‌ ఉపాధ్యక్షుడు తంగళపల్లి శ్రీనివాసులు హాజరుకానున్నారు. వినియోగదారుల హక్కుల పరిరక్షణ, భవిష్యత్‌ ప్రణాళికకు రోడ్‌ మ్యా ప్‌, ఆహార కల్తీ నిరోధక చట్టం, లీగల్‌ మె ట్రాలజీ చట్టాల నిబంధనలపై మరింత అధికారాలు, సవరణ కోసం దేశవ్యాప్తంగా హాజరవుతున్న వినియోగదారుల ప్రతినిధులు తమ అభిప్రాయాలను సదస్సులో ప్రకటించనున్నారు. అలాగే లోపభూయిష్టమైన జనరిక్‌ మందుల వ్యాపారం కారణంగా వినియోగదారులు ఆర్థికంగా నష్టపోతున్న విధానాలపై శంకర్‌లాల్‌ చౌరాసియా, తంగళ్లపల్లి శ్రీనివాసులు జాతీయ కమిటీకి నివేదిక ఇవ్వనున్నారు.

కామారెడ్డి అర్బన్‌: ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లా స్థాయి అర్చరీ అండర్‌–14, 17 బాలబాలికల ఎంపిక పోటీలను శనివారం నిర్వహించనున్నారు. బాన్సువాడ మండలంలో ని కొత్తాబాది తిర్మలాపూర్‌ క్యాంప్‌ జెడ్పీ హైస్కూల్‌లో ఉదయం 8 గంటలకు పోటీ లు ప్రారంభమవుతాయని ఎస్‌జీఎఫ్‌ జిల్లా కార్యదర్శి శ్రీధర్‌ ఒక ప్రకటనలో తెలిపారు. క్రీడాకారులు బోనఫైడ్‌, ఆధార్‌, స్పోర్ట్స్‌ డ్రెస్‌, పరికరాలతో హాజరు కావాలని, వివరాలకు 94400 04112, 94415 79518 నంబర్లలో సంప్రదించాలని సూచించారు.

మద్నూర్‌: తడిహిప్పర్గాలో మద్య నిషేధం విధించినట్లు సర్పంచ్‌ అశ్విని తెలిపారు. గురువారం ఈ విషయమై గ్రామంలో ఏక గ్రీవ తీర్మానం చేశారు. గ్రామంలో ఎక్కడా మద్యం అమ్మరాదని, ఎవరైన ఈ నిబంధనను అతిక్రమిస్తే జరిమానాలు విధిస్తామని సర్పంచ్‌ హెచ్చరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement