సుభాష్‌నగర్ : టీకాల ద్వారా నియంత్రించే వ్యాధులను ఇకనుంచి జిల్లాస్థాయిలో కాకుండా పీహెచ్‌సీ స్థాయిలోనే ‘వ్యాక్సిన్ ప్రివెన్టబుల్ డిసిజెస్ సిస్టమేటిక్ ఇన్ఫర్మేషన్ మేనేజ్‌మెంట్ సిస్టమ్ పోర్టల్’లో నమోదు చేయాలని ట్రైనర్, పిల్లల వైద్య నిపుణులు శ్రీకాంత్ సూచించారు. నగరంలోని కలె క్టరేట్‌లోగల డీఎంహెచ్‌వో కార్యాలయంలో టీకాల ద్వారా నియంత్రించే వ్యాధులపై మంగళవారం జి ల్లాస్థాయి శిక్షణా కార్యక్రమం ఏర్పాటుచేశారు. ఈ సందర్భంగా శ్రీకాంత్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో 8 జిల్లాలను పైలట్ ప్రాజెక్టు కింద ఎంపిక చేశారని, అందులో నిజామాబాద్ ఒకటని తెలిపారు. వ్యాక్సి న్ ప్రివెన్టబుల్ డిసిజెస్ సిస్టమేటిక్ ఇన్ఫర్మేషన్ మేనేజ్‌మెంట్ సిస్టమ్‌లో భాగంగా టీకాల ద్వారా నియంత్రించే వ్యాధుల తీవ్రతను తగ్గించడం, అకస్మాత్తు గా ఒకేసారి ఎక్కువ మొత్తంలో వ్యాధులతో బాధపడే వ్యక్తుల అవుట్ బ్రేక్స్‌ను గుర్తిస్తారన్నారు. అలా గే పలు అంశాలపై అవగాహన కల్పించారు. నులిపురుగుల నివారణ ఆరోగ్య కార్యక్రమాలపై వైద్యాధికారులకు డీఎంహెచ్‌వో రాజశ్రీ సూచనలు చేశారు. డీఐవో అశోక్, అజ్మల్, శ్రావ్య, డీడీఎం పృథ్వీ, డి ప్యూటీ డీఎంహెచ్‌వో రవీందర్, విద్య, సికందర్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.


