జక్రాన్‌పల్లి : పసుపు రైతుల ఉత్పత్తిదారుల సంఘా లకు నిధులు మంజూరు చేయాలని కేంద్ర సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల శాఖ సహాయ మంత్రి శోభా కరంద్లాజేను రైతు ఉత్పత్తిదారుల సంఘం అధ్యక్షుడు తిరుపతిరెడ్డి కోరారు. మంగళవారం హై దరాబాద్‌లో జేఎంకేపీఎం రైతు ఉత్పత్తి దారుల సంఘం ఆధ్వర్యంలో కేంద్ర సహాయ మంత్రిని కలి సి వినతిపత్రం అందజేశారు. శాఖ తరఫున గ్రామీ ణ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన పరిశ్రమలకు పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని మంత్రి హామీ ఇచ్చినట్లు తిరుపతిరెడ్డి తెలిపారు. ప్రకృతి ఎన్జీవో సీఈవో జయశ్రీ, డైరెక్టర్లు సామ గంగారెడ్డి, అల్లూరి సంతోష్, గడ్డం శ్రీనివాస్, పుప్పాల నాగేశ్, రాజు తదితరులు సహాయ మంత్రిని కలిసిన వారిలో ఉన్నారు.


