బోధన్: పట్టణ, పరిసర ప్రాంతాల్లో మోటర్ బైక్‌లను దొంగతనానికి పాల్పడుతున్న ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసినట్లు బోధన్ ఏసీపీ శ్రీనివాస్, టౌన్ సీఐ వెంకటనారాయణ తెలిపారు. పట్టణంలోని పోలీస్‌స్టేషన్‌లో మంగళవారం వారు వివరాలను వెల్లడించారు. పట్టణ శివారులోని బాబాగార్డెన్ వద్ద పోలీసులు వాహనాలు తనిఖీ చేస్తుండగా బోధన్‌లోని బీటీనగర్‌కు చెందిన వసీం, ఆటోనగర్ కాలనీకి చెందిన జావిద్‌లు అనుమానాస్పదంగా బైక్‌పై రావడంతో పట్టుకుని విచారించారు. విచారణలో వారు బైక్‌ల చోరీలకు పాల్పడుతున్నట్టు వెల్లడైంది.
దీంతో వారిని పట్టుకొని, వారి వద్ద నుంచి ఐదు బైక్‌లను స్వాధీనం చేసుకున్నారు. ఏఎస్సై బాబురావు, కానిస్టేబుల్స్ గంగారాం, శివకృష్ణను ఏసీపీ అభినందించారు.


