● పెద్దమల్లారెడ్డిలో బైక్‌ను యథాస్థానంలో ఉంచిన దుండగులు
భిక్కనూరు: ఎత్తుకెళ్లిన బైక్‌ను తిరిగి యజమాని ఇంటి ముందు గుర్తుతెలియని వ్యక్తులు పెట్టిన ఘటన భిక్కనూరు మండలం పెద్దమల్లారెడ్డి గ్రామంలో మంగళవారం వేకువజామున జరిగింది. వివరాలు ఇలా.. గ్రామానికి చెందిన సురేష్ కుమార్ తన బైక్‌ను ఇంటి ముందు నిలిపి ఉంచగా గుర్తుతెలియని వ్యక్తులు చోరీ చేసిన విషయం విధితమే. ఈ విషయమై బాధితుడు సురేష్‌కుమార్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఎస్సై అంజనేయులు ఘటన స్థలాన్ని సందర్శించి, నిందితులను గుర్తించి కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. దీంతో గుర్తుతెలియని వ్యక్తులు తాము ఎత్తుకెళ్లిన వాహనాన్ని తిరిగి యజమాని అయిన సురేష్ కుమార్ ఇంటి ముందర నిలిపి వెళ్లిపోయారు. బైక్ హెడ్‌లైట్‌తోపాటు పలుచోట్ల వాహనంను ధ్వంసం చేశారు.


