రైతులకు కేంద్ర ప్రభుత్వం అండగా ఉండాలి | - | Sakshi
Sakshi News home page

రైతులకు కేంద్ర ప్రభుత్వం అండగా ఉండాలి

Jul 15 2026 5:03 AM | Updated on Jul 15 2026 5:03 AM

నిజామాబాద్‌ రూరల్‌: రైతులకు కేంద్ర ప్రభుత్వం అండగా ఉండాలని సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యుడు బుర్రి ప్రసాద్‌ అన్నారు. జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. దేశంలో వర్షాభావ పరిస్థితుల మూలంగా రైతులు వేసిన పంటలు దెబ్బతిని నష్టపోయే పరిస్థితి వచ్చిందని, ఎల్‌నినో ప్రభావంతో రాష్ట్రంలో వర్షపాతం తక్కువగా ఉండటంతో పంటలు పండించటం కష్టమవుతుందని ఫలితంగా కరువు పరిస్థితులు ఏర్పడ్డాయన్నారు. రైతులను ఆదుకోవటానికి కేంద్ర ప్రభుత్వం కార్యాచరణ చేపట్టాలని, ప్రధానంగా రైతు సంఘాలు వ్యవసాయ కార్మిక సంఘం కార్మిక సంఘాలతో సమావేశాలు నిర్వహించి వీటిని ఎదుర్కోవటానికి తీసుకోవాల్సిన కార్యాచరణపై చర్చించాలన్నారు. పార్టీ జిల్లా కార్యదర్శి రమేశ్‌బాబు, కార్యదర్శి వర్గ సభ్యులు పెద్ది వెంకట్‌రాములు, వెంకటేశ్‌, శంకర్‌గౌడ్‌, జిల్లా కమిటీ సభ్యులు కొండ గంగాధర్‌, నన్నేసావ్‌ జంగం, గంగాధర్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement