కరిగించిన కథనం..
● వెన్ను విరిగిన భర్తకు దన్నుగా
నిలుస్తున్న మల్లీశ్వరి
● ఆమె కష్టాన్ని కళ్లకు కట్టిన ‘సాక్షి’
● ఉద్యోగం ఇచ్చి అండగా నిలిచిన విద్యుత్ శాఖ
● సాయానికి ముందుకొస్తున్న దాతలు
సాక్షి ప్రతినిధి, కామారెడ్డి/నాగిరెడ్డిపేట : విద్యుత్ స్తంభంపై నుంచి పడిపోయి వెన్నువిరిగిన యాదగి రి దీనస్థితిపై ‘సాక్షి’లో ప్రచురితమైన కథనం అధికారులను కదిలించింది. ఆయన భార్యకు అవుట్ సోర్సింగ్ పద్ధతిలో క్యాజువల్ లేబర్ ఉద్యోగాన్ని ఇచ్చారు.
నాగిరెడ్డిపేట మండలం గోపాల్‌పేట గ్రామానికి చెందిన బోయిని యాదగిరి విద్యుత్ శాఖలో క్యాజువల్ లేబర్‌గా పనిచేసేవాడు. గతేడాది జూన్ 3న స్తంభంపై ఏబీ స్విచ్ మరమ్మతు చేసే క్రమంలో కిందపడిపోగా వెన్నుపూస దెబ్బతింది. నడుము, రెండు కాళ్లు సచ్చుబడిపోయాయి. సికింద్రాబాద్ కి మ్స్‌లో వైద్యం చేయించినా మెరుగుపడలేదు. ఇక ముందు కూడా ఆయన పరిస్థితి అంతే అని వైద్యు లు చెప్పారు. యాదగిరికి తండ్రి మల్లయ్య, భార్య మల్లీశ్వరి, ముగ్గురు పిల్లలు ఉన్నారు. యాదగిరిని ఇంటికి తీసుకువచ్చి ఏడాది కా లంగా ఆయన భార్య సపర్య లు చేస్తూ కంటికి రెప్పలా చూ సుకుంటోంది. ఆమె కష్టాలను ‘సాక్షి’ కళ్లకు కట్టేలా ‘ఆమే వె న్నెముక’ శీర్షికన ఈనెల 12న కథనాన్ని ప్రచురించింది. ఇది ఎందరినో కదిలించింది. మూడు రోజుల్లో పలువురు దాతల ద్వారా దాదాపు రూ.90 వేల సాయం అందింది. మల్లీశ్వరి కి ఉద్యోగం ఇస్తే ఆ కుటుంబానికి ఎంతో ఆసరా అ వుతుందని ‘సాక్షి’ ఆ కథనంలో నొక్కిచెప్పడంతో విద్యుత్ అధికారులు స్పందించారు. అవుట్ సోర్సింగ్ ద్వారా క్యాజువల్ లేబర్ ఉద్యోగాన్ని ఇస్తూ మంగళవారం నియామకపు కాపీని ఆమెకు అందించా రు. నాగిరెడ్డిపేట సమీపంలోని బంజర సెక్షన్ ఆఫీ సులో క్యాజువల్ లేబర్ ఉద్యోగం కల్పించారు. దీంతో ఏడాది కాలంగా ఎన్నో అవస్థ లు పడుతున్న యాదగిరి కుటుంబానికి ఊరట కలిగింది. ఈ సందర్భంగా మళ్లీశ్వరి మాట్లాడుతూ తాము పడుతున్న కష్టాలను వెలుగులోకి తీసుకువచ్చి న ‘సాక్షి’కి ఎప్పటికీ రుణపడి ఉంటామన్నారు. సాయం అందించిన దాతలు, అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు.


