సంక్షేమానికి పెద్దపీట | - | Sakshi
Sakshi News home page

సంక్షేమానికి పెద్దపీట

Aug 16 2025 8:19 AM | Updated on Aug 16 2025 8:19 AM

సంక్ష

సంక్షేమానికి పెద్దపీట

న్యూస్‌రీల్‌

నిజామాబాద్‌

వాతావరణం

ఆకాశం మేఘావృతమవుతుంది. చల్లని గాలులు వీస్తాయి. మోస్తరు నుంచి భారీ వర్షం కురిసే అవకాశం ఉంది.

రైతులకు మరింత సేవ..

మరోసారి పదవీకాలం పొడిగింపుతో రైతులకు మరింత సేవచేసే భాగ్యం కలిగిందని డీసీసీబీ చైర్మన్‌ రమేశ్‌రెడ్డి అన్నారు.

శనివారం శ్రీ 16 శ్రీ ఆగస్టు శ్రీ 2025

– 8లో u

జాతీయ జెండాకు వందనం చేస్తున్న ముఖ్య అతిథి, బీసీ కమిషన్‌ చైర్మన్‌ నిరంజన్‌, ఎమ్మెల్యేలు ధన్‌పాల్‌, రాకేశ్‌రెడ్డి, కలెక్టర్‌ వినయ్‌కృష్ణారెడ్డి, సీపీ సాయిచైతన్య తదితరులు

ఎస్సారెస్పీలోకి 60 వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో

వేగంగా పెరుగుతున్న

ప్రాజెక్ట్‌ నీటి మట్టం

గంటగంటకూ ఎక్కువవుతున్న వరద

బాల్కొండ: శ్రీరాంసాగర్‌ ప్రాజెక్ట్‌లోకి ఎగువ ప్రాంతాల నుంచి ఇన్‌ఫ్లో క్రమంగా పెరుగుతోంది. గురువారం 13,910 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో రాగా.. శుక్రవారం ఉదయం నుంచి గంట గంటకూ పెరుగుతూ ెరాత్రి 9 గంటల వరకు 60 వేల క్యూసెక్కులకు చేరింది. ప్రాజెక్ట్‌ నుంచి కాకతీయ కాలువ ద్వారా 5 వేల క్యూసెక్కులు, సరస్వతి కాలువకు 800, అలీసాగర్‌ లిఫ్ట్‌కు 180 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. మిషన్‌ భగీరథ అవసరాలకు 231 క్యూసెక్కులు వినియోగిస్తుండగా, ఆవిరి రూపంలో 502 క్యూసెక్కుల నీరు పోతోంది. ప్రాజెక్ట్‌ పూర్తి స్థాయి నీటి మట్టం 1091(80.5 టీఎంసీలు) అడుగులు కాగా, శుక్రవారం రాత్రి వరకు 1081.10(48 టీఎంసీలు) అడుగుల నీరు నిల్వ ఉందని ప్రాజెక్ట్‌ అధికారులు తెలిపారు.

గోదావరికి పెరిగిన వరద

రెంజల్‌(బోధన్‌), నాలుగు రోజులుగా జిల్లాతోపాటు ఎగువన ఉన్న మహారాష్ట్రలో విస్తారంగా వర్షాలు కురుస్తుండడంతో గోదావరిలో వరద ప్రభావం పెరిగింది. కందకుర్తి వద్ద గోదావరి ఉధృతంగా ప్రవహిస్తోంది. పుష్కర క్షేత్రంలోని పురాతన శివాలయం చుట్టూ వరద నీరు చేరింది.

నిజాంసాగర్‌లోకి భారీ వరద

25,500 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో

నిజాంసాగర్‌: ఎగువన ఉన్న మెదక్‌, సంగారెడ్డి జిల్లాలలో కురుస్తున్న వర్షాలకు శుక్రవారం సాయంత్రం నిజాంసాగర్‌ ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. సింగూరు ప్రాజెక్టుతో పాటు ఘనపురం ఆనకట్ట, హల్ది వాగుల ద్వారా 25,500 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తోందని ప్రాజెక్టు అధికారులు తెలిపారు. ఎగువ నుంచి వరద నీరు భారీగా వచ్చి చేరుతుండడంతో ప్రాజెక్టు నీటిమట్టం క్రమంగా పెరుగుతోంది. నిప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 1,405 అడుగుల(17.8 టీఎంసీలు)కుగాను శుక్రవారం సాయంత్రానికి 1,394.92 అడుగుల (6.781 టీఎంసీలు) నీరు నిల్వ ఉంది.

సింగూర్‌ మూడు గేట్ల ఎత్తివేత

ఎగువన సంగారెడ్డి జిల్లాలో ఉన్న సింగూర్‌ ప్రాజెక్టుకు వరద పోటెత్తుతోంది. దీంతో ప్రాజెక్టు మూడు గేట్లను ఎత్తి 27 వేల క్యూసెక్కుల నీటిని మంజీర నదిలోకి వదులుతున్నారు. ఈ నీరు నిజాంసాగర్‌ ప్రాజెక్టును చేరనుంది.

నిజామాబాద్‌ అర్బన్‌: రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమానికి పెద్ద పీట వేస్తోందని, అర్హులందరికీ ఫలాలు అందుతున్నాయని బీసీ కమిన్‌ చైర్మన్‌ నిరంజన్‌ అన్నారు. 79వ స్వాతంత్య్ర వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన ఆయన జెండా ఆవిష్కరించిన అనంతరం ప్రసంగించారు. జిల్లా రైతాంగానికి రూ.755 కోట్ల 29 లక్షల రుణ మాఫీ చేయడంతోపాటు ఇందిరమ్మ రైతు భరోసా కింద ఎకరాకు రూ.12 చొప్పున పంట పెట్టుబడి సాయం అందజేయడం జరిగిందని వెల్లడించారు. తొమ్మిది రోజుల్లో రూ.9వేల కోట్ల రైతు భరోసా అందించడం జరిగిందన్నారు. 2047 నాటికి భారతదేశ ముఖచిత్రాన్ని మార్చే గేమ్‌ ఛేంజర్‌ పాత్రలో తెలంగాణ ఉండనుందని, ఆ సంకల్పానికి దార్శనిక పత్రమే ‘తెలంగాణ రైజింగ్‌ 2047’ అని పేర్కొన్నారు. ఇది కేవలం ప్రణాళిక కాదని, ప్రపంచ వేదికపై తెలంగాణను సగర్వంగా నిలబెట్టే సంకల్పమని అన్నారు. జిల్లాలో అభివృద్ధి, సంక్షేమ పథకాలపై స్వాతంత్య్ర దినోత్సవ వేదిక పైనుంచి నిరంజన్‌ ప్రసంగం సాగిందిలా..

రైతు రుణమాఫీ పథకం

జిల్లాలో 97,696 మంది రైతులకు రూ.755 కోట్ల 29 లక్షల పంట రుణం మాఫీ అయ్యింది. రైతు భరోసా కింద పెట్టుబడి సాయం అందింది.

భూ భారతి

రెవెన్యూ సదస్సుల ద్వారా గ్రామ స్థాయిలోనే సమస్యలను పరిష్కరించే అవకాశం ఉంది. జిల్లాలో మొత్తం 40,462 దరఖాస్తులు అందాయి.

పౌర సరఫరాల శాఖ

జూన్‌ నుంచి ఆగస్టు వరకు మొ త్తం 26,217 మెట్రిక్‌ టన్నుల ఉచిత సన్న బియ్యం పంపిణీ చేశాం. జనవరి నుంచి ఇప్పటి వరకు 11,852 నూతన రేషన్‌కా ర్డులు మంజూరు చేశాం.

మహాలక్ష్మి

2,19,330 మంది గ్యాస్‌ వినియోగదారులకు 10,19,994 సిలిండర్ల సబ్సిడీ విడుదల చేసి రూ.30 కోట్ల 73 లక్షలు చెల్లించడం జరిగింది. పథకం ప్రారంభమైన నాటి నుంచి ఈనెల 10వ తేదీ వరకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకున్న మహిళలకు రూ.249 కోట్ల 13 లక్షలు ఆదా అయ్యాయి.

గృహజ్యోతి

గృహజ్యోతిలో భాగంగా మార్చి 2024 నుంచి జూలై 2025 వరకు ప్రతి నెలా 2,67,707 మంది వినియోగదారులకు జీరో బిల్లులు వచ్చాయి.

వైద్యారోగ్యం

టీబీ ముక్త్‌ భారత్‌కు కృషి చేస్తున్నాం. ప్రస్తుతం జిల్లాలో కేవలం 1,211 మంది వ్యాధిగ్రస్తులు మాత్రమే చికిత్స పొందుతున్నారు.

విద్య

జిల్లాలో 1,156 పాఠశాలల్లో 90,359 విద్యార్ధులకు మధ్యాహ్న భోజనం అందుతోంది. రెండు కేజీబీవీలు మంజూరయ్యాయి. ధర్పల్లి, ఇందల్వాయి, మెండోర, రుద్రూర్‌, మోపాల్‌ కేజీబీవీల్లో ఇంటర్మీడియట్‌ విద్యను ప్రవేశపెట్టాం.

అటవీశాఖ

జిల్లా మొత్తం అటవీ విస్తీర్ణం 2,14,056.38 ఎకరాలు. నేటి వరకు 27 లక్షల మొక్కలు నాటడం పూర్తయ్యింది. జిల్లాలో మొత్తం 542 నర్సరీలు ఏర్పాటయ్యాయి.

శాంతి భద్రతల పరిరక్షణ

డయల్‌ 100 ద్వారా ఫిర్యాదులు స్వీకరించి 5 నిమిషాల్లో పోలీసులు సమస్యలను పరిష్కరిస్తున్నారు. శాంతి భద్రతలను సామరస్యాన్ని కాపాడినందుకు, జిల్లాలో ఎక్కడ కూడా అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా చర్యలు తీసుకున్నందుకు జి ల్లా పోలీస్‌ యంత్రాంగానికి అభినందనలు.

స్వాతంత్య్ర వేడుకల్లో స్నేహ సొసైటీ రూరల్‌ ఫర్‌ రూరల్‌ రీ కన్‌స్ట్రక్షన్‌కు చెందిన మానసిక దివ్యాంగులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. యునైటెడ్‌ వి స్టాండ్‌.. మేరా భారత్‌ మహాన్‌ తదితర నినాదాలతో ప్లకార్డులను ప్రదర్శిస్తూ 75 మంది మానసిక దివ్యాంగులు నృత్యాలు చేశారు. ఈ సందర్భంగా చిన్నారులను ముఖ్య అతిథి అయిన బీసీ కమిషన్‌ చైర్మన్‌ నిరంజన్‌, కలెక్టర్‌ వినయ్‌కృష్ణారెడ్డి, సీపీ సాయిచైతన్య, ఉన్నతాధికారులు ప్రత్యేకంగా అభినందించారు. – నిజామాబాద్‌ నాగారం

వ్యవసాయ రంగం

వానాకాలం సీజన్‌కు సంబంధించి జిల్లాలో ఇప్పటి వరకు వరి 4.19 లక్షల ఎకరాల విస్తీర్ణంలో, మొక్కజొన్న 52 వేల ఎకరాలు, సోయాచిక్కుడు 33 వేల ఎకరాలు, పసుపు 23 వేల ఎకరాల విస్తీర్ణంలో మొత్తం సుమారు 5 లక్షల 33 వేల ఎకరాల్లో రైతులు పంటు సాగు చేస్తున్నారు. పంటల సాగులో అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు 1,746 మెట్రిక్‌ టన్నుల యూరియా బఫర్‌ లో ఉంది.

ఇందిరమ్మ ఇళ్లు

19,397 ఇందిరమ్మ ఇళ్ల ని ర్మాణం లక్ష్యం. లబ్ధిదారులకు 17,301 ఇళ్లు మంజూరయ్యాయి. 9,486 ఇళ్ల మార్కింగ్‌ పూర్తి కాగా, 4,820 ఇళ్లు బేస్మెంట్‌, 742 రూఫ్‌, 237 స్లాబ్‌ లెవెల్‌ పనులు పూర్తయ్యాయి. రూ.60.36 కోట్లు ఖర్చు చేయడం జరిగింది.

ఐక్యతే మనబలం

జిల్లాలో రూ.755 కోట్ల

29 లక్షల రుణ మాఫీ

భూ భారతితో గ్రామ స్థాయిలోనే

సమస్యలకు పరిష్కారం

17,301 ఇందిరమ్మ ఇళ్లు మంజూరు

11,852 నూతన రేషన్‌కార్డులు

సజావుగా సంక్షేమ పథకాల అమలు

స్వాతంత్య్ర వేడుకల్లో ముఖ్య అతిథిగా ప్రసంగించిన నిరంజన్‌

సంక్షేమానికి పెద్దపీట 1
1/11

సంక్షేమానికి పెద్దపీట

సంక్షేమానికి పెద్దపీట 2
2/11

సంక్షేమానికి పెద్దపీట

సంక్షేమానికి పెద్దపీట 3
3/11

సంక్షేమానికి పెద్దపీట

సంక్షేమానికి పెద్దపీట 4
4/11

సంక్షేమానికి పెద్దపీట

సంక్షేమానికి పెద్దపీట 5
5/11

సంక్షేమానికి పెద్దపీట

సంక్షేమానికి పెద్దపీట 6
6/11

సంక్షేమానికి పెద్దపీట

సంక్షేమానికి పెద్దపీట 7
7/11

సంక్షేమానికి పెద్దపీట

సంక్షేమానికి పెద్దపీట 8
8/11

సంక్షేమానికి పెద్దపీట

సంక్షేమానికి పెద్దపీట 9
9/11

సంక్షేమానికి పెద్దపీట

సంక్షేమానికి పెద్దపీట 10
10/11

సంక్షేమానికి పెద్దపీట

సంక్షేమానికి పెద్దపీట 11
11/11

సంక్షేమానికి పెద్దపీట

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement