
ఒకే వార్డులో కుటుంబమంతా..
మోర్తాడ్(బాల్కొండ): గ్రామ పంచాయతీ ఎన్నికలకు ప్రభుత్వం ఇంకా పచ్చజెండా ఊపకపోయినా క్షేత్రస్థాయిలో మాత్రం ఏర్పాట్లు ముమ్మరంగా సా గుతున్నాయి. ఓటర్ల జాబితాను సవరిస్తూ ఆన్‌లైన్ లో నమోదు చేయడంలో పంచాయతీ కార్యదర్శు లు, కంప్యూటర్ ఆపరేటర్లు బిజిబిజీగా ఉన్నారు. కొత్తగా ఓటరు నమోదు చేసుకోవడంతో అనేక చో ట్ల ఓటర్ల సంఖ్య పెరిగింది.ఈ నేపథ్యంలో ఒక కు టుంబంలోని ఓటర్లందరూ ఒకే వార్డులో ఉండేలా సవరణ చేపట్టారు. గతంలో భార్య ఒక వార్డులో ఓటు హక్కు కలిగి ఉంటే, భర్త ఇతర కుటుంబసభ్యులు మరో వార్డులో ఓటు వేసేవారు. ఇలాంటి పరిస్థితి గందరగోళానికి దారి తీస్తుందనే ఉద్దేశంతో కుటుంబసభ్యులంతా ఒకే వార్డులో ఉండేలా చర్య లు తీసుకుంటున్నారు.
మార్పులు, చేర్పులు.. తొలగింపులు
జిల్లాలో పాత గ్రామ పంచాయతీలు 530 ఉండగా కొత్తగా విభజించిన పంచాయతీల సంఖ్య 15 ఉంది. మొత్తం వార్డులు 5022 ఉన్నట్లు అధికారులు గతంలో వెల్లడించారు. డిసెంబర్ 2024 నాటికి పంచాయతీలలో ఓటర్ల సంఖ్య 8,30,580గా నమోదైంది. ఈ సంవత్సరం ఆరంభంలో ఓటర్ల నమోదు చేపట్టగా సంఖ్య పెరిగింది. మరణించిన వారి పేర్లు జాబితా నుంచి తొలగించడం, కొత్తవారి చేరికతో ఓటర్ల జాబితా సవరణ అనివార్యమైంది. కాగా, ఓటర్ల జాబితాలను సవరిస్తూ ఆన్‌లైన్‌లో నమోదు చేయడంతో పనిభారం పెరిగిందని పంచాయతీ ఉద్యోగులు చెబుతున్నారు.
ఆన్‌లైన్ నమోదు కొనసాగుతోంది
ఓటర్ల జాబితాల సవరణ, ఆన్‌లైన్‌లో నమోదు ప్ర క్రియ కొనసాగుతోంది. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఉన్నతాధికారులు సూచించిన విధంగా ప్ర తి పంచాయతీ ఓటర్ల జాబితాను ఆన్‌లైన్‌లో నమో దు చేస్తున్నాం.ఎలాంటి తప్పులు దొర్లకుండా జా గ్రత్తలు తీసుకుంటున్నాం. – శ్రీధర్, ఎంపీవో, మోర్తాడ్
గ్రామ పంచాయతీ ఓటర్ల
జాబితా సవరణ
ఆన్‌లైన్‌లో నమోదు చేస్తున్న ఉద్యోగులు
ఎన్నికలకు ఖరారు కాని షెడ్యూల్
క్షేత్రస్థాయిలో జరుగుతున్న ఏర్పాట్లు