
ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
● కలెక్టర్ వినయ్‌కృష్ణారెడ్డి,
సీపీ సాయిచైతన్య
● బోధన్ నియోజకవర్గంలో పర్యటన
బోధన్‌టౌన్(బోధన్): ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ వినయ్‌కృష్ణారెడ్డి సూచించారు. అధికారులు ప్రజలకు ఇబ్బందులు కలుగకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పట్టణంలోని 24, 35 వార్డుల్లో శనివారం కలెక్టర్ పర్యటించారు. అనిల్ టాకీస్ చౌరస్తాలో శర్భతీ కెనాల్‌పై గల రోడ్డు మరమ్మతులను పరిశీలించారు. త్వరితగతిన పనులు పూర్తిచేయాలని, ప్రజల రాకాపోకలకు ఇబ్బంది కలుగకుండా చూడాలని సిబ్బందికి వెల్లడించారు. సబ్ కలెక్టర్ వికాస్ మహతో, బల్దియా సిబ్బంది ఉన్నారు.
బోధన్‌లోని అనిల్ టాకీస్ చౌరస్తాలోగల శర్భతీ కెనాల్ మరమ్మతులను శనివారం రాత్రి సీపీ సాయిచైతన్య పరిశీలించారు. పనులు పూర్తిచేసే వరకు పోలీసులు, ట్రాఫి క్ పోలీసులు బందోబస్తు నిర్వహించాలని ఆదేశాలు జారీ చేశారు. ట్రాఫిక్ మళ్లింపుపై ఏసీపీ శ్రీనివాస్‌ను అడిగి తెలుసుకున్నారు. సీఐ వెంకట నారా యణ,ట్రాపిక్ సిఐ చందర్ రాథోడ్ లు ఉన్నారు.
వాగులను దాటొద్దు..
వర్ని: భారీ వర్షాలకు లోలెవల్ వంతెనల మీదుగా వరద నీరు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నందున ఎవరూ వాగుదాటేందుకు ప్రయత్నాలు చేయవద్దని, లోత ట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సీపీ సాయి చైతన్య ప్రజలకు సూచించారు. వర్ని పోలీస్ స్టేషన్ పరిధిలోని జలాల్పూర్ శివారులోని సైదిపూర్ రిజర్వాయర్ ( చెరువు) అలుగు, కోకల్‌దాస్ తండా శివారులోని లోలెవల్ వంతెనను సీపీ పరిశీలించారు. గ్రామాల్లో వర్షాల వల్ల కలిగే నష్టాల స మాచారాన్ని ఎప్పుటికప్పుడు అందించాలని గ్రామ స్థాయి అధికారులను ఆదేశించారు. అత్యవసర స మయంలో సంబంధిత పోలీస్ స్టేషన్ లేదా 100 డయల్ చేయాలని, లేదా పోలీస్ కంట్రోల్ రూం 8712659700 నంబర్‌కు సంప్రదించాలన్నారు. బో ధన్ ఏసీపీ శ్రీనివాస్, రుద్రూర్ సీఐ కృష్ణ, ఎస్సై మ హేష్, సాయన్న, ఎంపీడీవో వెంకటేశ్ ఉన్నారు.

ప్రజలు అప్రమత్తంగా ఉండాలి