
క్రైం కార్నర్
నీటి గుంతలో పడి ఒకరి మృతి
ఇందల్వాయి: మండలంలోని గన్నారం గ్రామ శివారులోగల రోడ్డు పక్కన ఉన్న నీటి గుంతలో పడి ఒకరు మృతిచెందినట్లు పోలీసులు తెలిపారు. వివరాలు ఇలా.. మండలంలోని సిర్నాపల్లి గ్రామానికి చెందిన పురేందర్ గౌడ్(52) గతంలో ఉపాధి కోసం వైన్ షాపుల్లో, కల్లు బట్టీల్లో పని చేసేవాడు. ప్రస్తుతం ఉపాధి లేకపోవడతో పని కోసం వెతుకుతున్నాడు. ఈక్రమంలో శుక్రవారం రాత్రి అతడు ఇందల్వాయి నుంచి సిర్నాపల్లి వైపు నడుచుకుంటూ బయలుదేరాడు. గన్నారం గ్రామ శివారులోగల రోడ్డు పక్కన ఉన్న నీటి గుంతలో అతడు ప్రమాదవశాత్తు జారిపడి మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మృతుడికి భార్య, ఇద్దరు కూతుర్లు ఉన్నారని, భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై సందీప్ తెలిపారు.
చికిత్స పొందుతూ ఒకరు..
మోర్తాడ్(బాల్కొండ): రోడ్డు ప్రమాదంలో గాయపడిన ఓ వ్యక్తి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందాడు. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా.. మోర్తాడ్‌కు చెందిన కనకం అనిల్(31) ఈనెల 4న బంధువులను కలవడానికి బైక్‌పై శెట్‌పల్లి గ్రామానికి వెళ్లాడు. తిరిగి ఇంటికి బయలుదేరగా, పాలెం సమీపంలో రోడ్డుపై ఉన్న గుంతలో పడి, తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు వెంటనే అతడిని చికిత్స నిమిత్తం ఆర్మూర్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ శుక్రవారం సాయంత్రం మరణించాడు. మృతదేహానికి శనివారం ఆర్మూర్ ఆస్పత్రిలో పోసుమార్టం నిర్వహించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రాము తెలిపారు. మృతుడికి తల్లి, భార్య, ఒక కొడుకు, కూతురు ఉన్నారు.
బీబీపేట మండలంలో ఒకరు..
బీబీపేట: ఇటీవల ఆత్మహత్యకు యత్నించిన ఓ వ్యక్తి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందాడు. ఎస్సై ప్రభాకర్ తెలిపిన వివరాలు ఇలా.. బీబీపేట గ్రామానికి చెందిన పోసు నారాయణ (65) గత మూడేళ్లుగా అల్సర్‌తో బాధపడుతుండేవాడు. ఎన్ని ఆస్పత్రుల్లో చూపించినప్పటికీ వ్యాధి నయం కాలేదు. దీంతో అతడు జీవితంపై విరక్తి చెంది గురువారం రాత్రి గడ్డిమందు తాగాడు. కుటుంబసభ్యులు గమనించి వెంటనే అతడిని చికిత్స నిమిత్తం ఎల్లారెడ్డిపేట ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ శనివారం రాత్రి చనిపోయాడు. శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం కామారెడ్డి ఏరియా ఆస్పత్రికి తరలించారు. మృతుడి భార్య లక్ష్మి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
కామారెడ్డి క్రైం: కామారెడ్డి పెద్ద చెరువులో ఓ గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైనట్లు దేవునిపల్లి పోలీసులు శనివారం తెలిపారు. మృతదేహం పూర్తిగా కుళ్లిపోయిన స్థితిలో ఉండటంతో మూడు రోజుల క్రితం చెరువులో పడి చనిపోయి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. మృతుడి వయస్సు 25 నుంచి 35 ఏళ్ల మధ్య ఉంటుందని ఎస్సై రంజిత్ తెలిపారు.

క్రైం కార్నర్

క్రైం కార్నర్

క్రైం కార్నర్