
అవినీతే సమస్య..
నిజామాబాద్ అర్బన్ : 79 ఏళ్ల స్వాతంత్య్ర భారతంలో అతి పెద్ద సమస్యగా అవినీతి ఉందని, స్వేచ్ఛ, సమానత్వం అంతంతేనని పలువురు అభిప్రాయపడ్డారు. స్వాతంత్య్ర దినోత్సవం నేపథ్యంలో ‘సాక్షి’ సర్వే నిర్వహించింది. స్వతంత్ర భారతంలో అవినీతి, పేదరికం పెద్ద సమస్యగా మారాయని, అధికారులు నీతి, నిజాయితీతో పని చేయాలని అభిప్రాయం వ్యక్తం చేశారు. మూడు ప్రధాన ప్రశ్నలకు 30 మంది సమాధానాలిచ్చారిలా..
● మీరు ఎదుర్కొంటున్న అతి పెద్ద సమస్య ఏది..
(ఏ) అవినీతి (బీ) పేదరికం (సీ) నాణ్యమైన విద్య (డీ) వైద్యం (ఇ) కుల వివక్ష
● (ఏ)4 (బీ)3 (సీ) 1 (డీ) 1 (ఇ) 1
● స్వేచ్ఛ – సమాఽనత్వ్యం నిజంగానే అందరికి చేరుతోందా..
(ఏ) అవును (బీ) లేదు (సీ) కొద్దిగా
● (ఎ)4 (బీ)4 (సీ) 2
● స్వాతంత్య్ర ఫలాలు అందరికీ దక్కాలంటే.. మరింత నీతి, నిజాయితీగా పనిచేయాల్సిన రంగం..
(ఏ) చట్ట సభలు (బీ) న్యాయ స్థానాలు
(సీ) అధికార యంత్రాంగం (డీ) మీడియా
● (ఏ)2 (బీ) 2 (సీ) 5 (డీ) 1
స్వేచ్ఛ, సమానత్వం అంతంతే..
అధికార యంత్రాంగం నీతి, నిజాయితీతో పని చేయాలి
‘సాక్షి’ సర్వేలో ప్రజల అభిప్రాయాలు