
ప్రపంచానికి తలమానికం..
వైద్యరంగంలో ప్రపంచానికి భారతదేశం తలమానికంగా నిలుస్తుంది. ఏఐ కారణంగా వైద్యరంగంలో చాలా మార్పులు రాబోతున్నాయి. అధునాతన పరికరాలు అందుబాటులోకి వస్తాయి. ప్రభుత్వ ఆస్పత్రులపై నమ్మకంతో వచ్చిన రోగులు మళ్లీ ప్రైవేట్ ఆస్పత్రులకు వెళ్లకుండా భవిష్యత్‌లు అన్ని వైద్య సేవలందనున్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వైద్యరంగానికి నిధులు కేటాయిస్తూ అభివృద్ధి చేస్తున్నాయి. 2047 నాటికి దేశంలోని అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రజలకు పల్లె, పట్టణం తేడా లేకుండా మెరుగైన వైద్య సేవలు అందుతాయన్న నమ్మకం నాకు ఉంది. – శ్రీనివాస్, జీజీహెచ్ సూపరింటెండెంట్