
బీసీ కమిషన్ చైర్మన్‌కు స్వాగతం పలికిన కలెక్టర్
నిజామాబాద్ అర్బన్: స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొననున్న రాష్ట్ర వెనుకబడిన తరగతుల కమిషన్ చైర్మన్ ఎస్.నిరంజన్ గురువారం రాత్రి జిల్లా కేంద్రానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆర్‌అండ్‌బీ అతిథి గృహం వద్ద ఆయనను కలెక్ట ర్ వినయ్ కృష్ణారెడ్డి, ఇతర అధికారులు మ ర్యాద పూర్వకంగా కలిసి పూల మొక్క అందించి స్వాగతం పలికారు. వారి వెంట ఆ ర్మూర్ సబ్ కలెక్టర్ అభిజ్ఞాన్, నిజామాబాద్ ఆర్డీవో రాజేంద్రకుమార్ తదితరులు ఉన్నారు.
బెటాలియన్ ఏఆర్ ఎస్సైకి
విశిష్ట సేవా పతకం
డిచ్‌పల్లి: డిచ్‌పల్లి మండల కేంద్రంలోని తెలంగాణ రాష్ట్ర ప్రత్యేక పోలీస్ ఏడో బెటాలియన్‌కు చెందిన ఏఆర్ ఎస్సై రామ్ దులారి సింగ్‌కు గురువారం కేంద్ర ప్రభుత్వం విశిష్ట సేవా పతకం ప్రకటించింది. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా విశేష సేవలందించిన వారికి ప్రభుత్వం ఈ పతకం అందజేస్తుందని బెటాలియన్ అధికారులు తెలిపారు.
గంగాసాగర్‌కు అంబేడ్కర్
ఎక్సలెన్సీ అవార్డు
నందిపేట్(ఆర్మూర్): నందిపేట మండల కేంద్రానికి చెందిన కానూరి గంగాసాగర్ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఎక్సలెన్సీ అవార్డు–2025ను అందుకున్నాడు. హైదరాబాద్‌లోని తెలంగాణ సారస్వత పరిషత్‌లో సోషల్ జస్టిస్ ఫర్ వరల్డ్ హ్యుమన్ రైట్స్ కమిషన్ ఆధ్వర్యంలో స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని గురువారం జరిగిన కార్యక్రమంలో విద్యారంగ విభాగంలో గంగాసాగర్ అవార్డును అందజేశారు. 28 సంవత్సరాలుగా గ్రామీణ ప్రాంత విద్యార్థులను చదువుతోపాటు అన్ని రంగాలలో రాణించేలా తీర్చిదిద్దిన నేపథ్యంలో ఈ అవార్డు వరించింది. అసిస్టెంట్ కమిషనర్ శ్యామ్ సుందర్‌సింగ్, అడ్వకేట్ సునీల్‌కుమార్, సోషల్ జస్టిస్ ఫర్ హ్యుమన్ రైట్ కౌన్సిల్ నేషనల్ చైర్మన్ కొప్పుల విజయ్‌కుమార్, ఆర్‌టీఐ డైరెక్టర్ సాప పండరీ చేతుల మీదుగా అవార్డు అందుకున్నాడు.
పీజీ సెమిస్టర్ పరీక్షలు ప్రారంభం
తెయూ(డిచ్‌పల్లి) : తెలంగాణ యూనివర్సిటీ పరిధిలో పీజీ 2, 4వ సెమిస్టర్ రెగ్యులర్, బీఈడీ 2, 4వ సెమిస్టర్ రెగ్యులర్ పరీక్షలు గురువారం ప్రారంభమైనట్లు ఆడిట్ సెల్ డైరెక్టర్ ప్రొఫెసర్ ఘంటా చంద్రశేఖర్ తెలిపారు. ఉదయం ఐదు పరీక్ష కేంద్రాలలో జరిగిన పీజీ పరీక్షల్లో 1861 మంది విద్యార్థులకు 1784 మంది హాజరుకాగా 77 మంది గైర్హాజరైనట్లు పేర్కొన్నారు. బీఈడీ పరీక్షల్లో 1544 మంది విద్యార్థులకు 1494 మంది హాజరుకాగా 50 మంది గైర్హాజరైనట్లు ఆయన తెలిపారు.

బీసీ కమిషన్ చైర్మన్‌కు స్వాగతం పలికిన కలెక్టర్