
ఘనంగా స్వాతంత్య్ర వేడుక
● త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించిన
రాష్ట్ర బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్
నిజామాబాద్ అర్బన్: జిల్లా కేంద్రంలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్‌లో 79వ స్వాతంత్య్ర వేడుకలు శుక్రవారం పండుగ వాతావరణంలో జరిగా యి. వేడుకల కోసం జిల్లా యంత్రాంగం విస్తృత ఏ ర్పాట్లు చేయగా, రాష్ట్ర వెనుకబడిన తరగతుల కమి షన్ చైర్మన్ ఎస్.నిరంజన్ ముఖ్య అతిథిగా హాజరై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించిన ఆయన.. పుర ప్రముఖులను, అధికారులు, అనధికారులను కలిసి స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. వివిధ శాఖల ద్వారా అమలవుతున్న కార్యక్రమా లు, సాధించిన ప్రగతిని తెలిపేలా ఏర్పాటు చేసిన స్టాళ్లను సందర్శించారు. ఆయా శాఖల ఫొటో ఎగ్జిబిషన్, శకటాలను ఆసక్తిగా తిలకించారు. ఉత్త మ సేవలు అందించిన ఉద్యోగులకు ప్రశంసాపత్రా లు అందజేశారు. స్వాతంత్య్ర సమర యోధులను, వారి కుటుంబీకులను సన్మానించారు. వేడుకల్లో భా గంగా చిన్నారులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆహూతులను ఆకట్టుకున్నాయి. ఎమ్మెల్యేలు ధన్‌పాల్ సూర్యనారాయణ, ఆర్.భూపతిరెడ్డి, పైడి రాకేశ్‌రెడ్డి, కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి, సీపీ సాయిచైతన్య, రాష్ట్ర సహకార సంఘాల యూనియన్ లిమిటెడ్ చైర్మన్ మానాల మోహన్ రెడ్డి, రాష్ట్ర వ్యవసాయ కమిషన్ సభ్యుడు గడుగు గంగాధర్, అదనపు కలెక్టర్లు అంకిత్, కిరణ్‌కుమార్, ట్రెయినీ కలెక్టర్ కరోలిన్ చింగ్తియాన్ మావీ, నగర పాలక సంస్థ కమిషనర్ దిలీప్ కుమార్, నిజామాబాద్ ఆర్డీవో రాజేంద్రకుమార్, ఆయా శాఖల అధికారులు, సిబ్బంది, స్వాతంత్య్ర సమరయోధులు, ప్రజలు, విద్యార్థులు పాల్గొన్నారు.