టోల్‌గేట్‌ బూత్‌లను ఢీకొన్న కంటైనర్‌ | - | Sakshi
Sakshi News home page

టోల్‌గేట్‌ బూత్‌లను ఢీకొన్న కంటైనర్‌

Jun 27 2023 12:22 AM | Updated on Jun 27 2023 9:15 AM

ధ్వంసమైన టోల్‌ బూత్‌   - Sakshi

ధ్వంసమైన టోల్‌ బూత్‌

భిక్కనూరు: భిక్కనూరు సమీపంలోని టోల్‌ గేట్‌ వద్ద సోమవారం రాత్రి జరిగిన ప్రమాదంలో టోల్‌ బూత్‌ బాక్స్‌లు రెండు ధ్వంసమయ్యాయి. టోల్‌ గేట్‌ సిబ్బందికి ఒక్కరికి తీవ్రగాయాలయ్యాయి. వివరాలు ఇలా ఉన్నాయి.. హైదరాబాద్‌ నుంచి కామారెడ్డి వైపు వెళ్తున్న కంటైనర్‌ అతి వేగంగా వచ్చి టోల్‌ గేట్‌ వద్ద ఉన్న డివైడర్‌తో పాటు రెండు బూత్‌ బాక్స్‌లను ఢీకొంది. దీంతో ఆరు, ఏడు బూత్‌ బాక్స్‌లు పూర్తిగా ధ్వంసమయ్యాయి. అలాగే కామారెడ్డి వైపు నుంచి హైదరాబాద్‌ వైపు వెళ్తున్న కారుపై టోల్‌బూత్‌ పడింది. దీంతో కారు ముందు భాగం ధ్వంసమైంది. అలాగే ఆరో బాక్స్‌లో విధులు నిర్వహిస్తున్న తిప్పాపూర్‌ గ్రామానికి చెందిన పోచయ్యకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే పోచయ్యను ఆసుపత్రికి తరలించారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని ప్రొక్లెయినర్‌తో బోల్తా పడిన కంటైనర్‌ను పక్కకు తొలగించి ధ్వంసమైన బూత్‌ బాక్స్‌లను రోడ్డు పక్కకు తప్పించారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement