పెర్కిట్(ఆర్మూర్): విద్యార్థులు బాలల సంరక్షణ కోసం ఏర్పాటు చేసిన చట్టాలపై అవగాహన పెంచుకోవాలని ఆర్మూర్ కోర్టు అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి పీ భవ్యశ్రీ అన్నారు. మామిడిపల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థులకు సురక్షిత్ బచ్‌పన్ అభియాన్‌లో భాగంగా చట్టాలపై అవగాహన కల్పించారు. విద్యార్థులు కష్టపడి చదివి ఉజ్వల భవిష్యతు కోసం బాల్యం నుంచే బాటలు వేసుకోవాలన్నారు. అనంతరం పోక్సో చట్టం, బాల్య వివాహాలతో కలిగే అనర్థాలను వివరించారు. కార్యక్రమంలో ఎంఈవో రవీందర్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
మాక్లూర్‌లో పోక్సోపై..
మాక్లూర్: మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ప్రతినిధులు మంగళవారం విద్యార్థులకు పోక్సో చట్టంపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో జేఎఫ్‌సీఎం అడిషనల్ కోర్టు జడ్జి హరికుమార్, నార్త్‌జోన్ సీఐ శ్రీనివాస్, ఎస్సై అనిల్‌రెడ్డి, అసిస్టెంట్ న్యాయవాదులు ప్రమోద్‌కుమార్, సుభంశ్రీ పాల్గొన్నారు.


