జక్రాన్‌పల్లి: మండలంలోని తొర్లికొండ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన పెండ్యాల సహస్ర, గేదెం శివకుమార్, మాదరి ప్రణవ్ జాతీయస్థాయి మినీ సబ్ జూనియర్ (అండర్–13) సాఫ్ట్‌బాల్ పోటీలకు ఎంపికయ్యారు. ఇటీవల తొర్లికొండ క్రీడా మైదానంలో నిర్వహించిన 11వ తెలంగాణ రాష్ట్ర మినీ సబ్ జూనియర్ సాఫ్ట్‌బాల్ బాలికల అంతర్ జిల్లా పోటీల్లో సహస్ర ప్రతిభ కనబరిచింది. అక్టోబర్ 16, 17 తేదీల్లో హనుమకొండలోని ఎల్‌బీ కళాశాల మైదానంలో నిర్వహించిన 11వ తెలంగాణ రాష్ట్ర మినీ సబ్ జూనియర్ సాఫ్ట్‌బాల్ బాలుర అంతర్ జిల్లా పోటీల్లో గేడెం శివకుమార్, మాదరి ప్రణవ్ జిల్లా జట్టు తరఫున పాల్గొని విజయంలో కీలకపాత్ర పోషించారు. దీంతో ముగ్గురు విద్యార్థులు జాతీయ స్థాయి పోటీలకు ఎంపికయ్యారని పాఠశాల పీడీ మర్కంటి గంగా మోహన్ తెలిపారు. ఈ నెల 28 నుంచి 31 వరకు మహారాష్ట్రలోని కోపర్‌గావ్ సంజీవని యూనివర్సిటీలో నిర్వహించనున్న జాతీయ స్థాయి మినీ సబ్ జూనియర్ సాఫ్ట్‌బాల్ పోటీల్లో పాల్గొంటారని పేర్కొన్నారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయుడు, మండల విద్యాధికారి మూడెడ్ల శ్రీనివాస్ విద్యార్థులను అభినందించారు.


