జాతీయ రహదారిపై లారీ బోల్తా | - | Sakshi
Sakshi News home page

జాతీయ రహదారిపై లారీ బోల్తా

Oct 28 2026 1:36 AM | Updated on Oct 28 2026 1:36 AM

జాతీయ రహదారిపై లారీ బోల్తా

ఇందల్వాయి: మండలంలోని చంద్రాయన్‌పల్లి గ్రామశివారులో 44వ నెంబర్‌ జాతీయ రహదారిపై నిర్మిస్తున్న కల్వర్టు వద్ద మంగళవారం లారీ బోల్తాపడింది. హైదరాబాద్‌ నుంచి నాగపూర్‌ వైపు కందిపప్పు లోడుతో వస్తున్న లారీ అదుపుతప్పింది. ప్రమాదంలో డ్రైవర్‌కు స్వల్ప గాయాలయ్యాయి. కందిపప్పు బస్తాలు రోడ్డుపై పడటంతో రెండు గంటలపాటు ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. సుమారు మూడు కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. టోల్‌ ప్లాజా సిబ్బంది, స్థానిక పోలీసులు శ్రమించి బస్తాలను తొలగించి క్రేన్‌ సహాయంతో లారీని పక్కకు లాగి వాహనాల రాకపోకలను పునరుద్ధరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement