మోడల్‌ స్కూళల్లో ‘ఎక్సలెన్స్‌’ శిక్షణ! | - | Sakshi
Sakshi News home page

మోడల్‌ స్కూళల్లో ‘ఎక్సలెన్స్‌’ శిక్షణ!

Oct 28 2026 1:36 AM | Updated on Oct 28 2026 1:36 AM

● ఉమ్మడి జిల్లాలో రెండు

పాఠశాలలు ఎంపిక

● కామారెడ్డిలో గోపాల్‌పేట,

నిజామాబాద్‌లో వేంపల్లి స్కూళ్లు

నాగిరెడ్డిపేట(ఎల్లారెడ్డి): ఐఐటీ, జేఈఈ, నీట్‌, క్లాట్‌ వంటి జాతీయస్థాయి పోటీ పరీక్షలకు తెలంగాణ మోడల్‌ స్కూళ్లల్లోని ఇంటర్‌ విద్యార్థులను సన్నద్ధం చేసేందుకు విద్యాశాఖ ఆధ్వర్యంలో ‘ఎక్సలెన్స్‌’ పేరిట శిక్షణ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. యంగ్‌ ఇండియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్‌(వైఐఐవోఈ) పేరిట ప్రత్యేక కేంద్రాలు ఏర్పాటు చేసి విద్యార్థులకు శిక్షణను ఇవ్వనున్నారు. అందులో భా గంగా రాష్ట్రంలోని 194 మోడల్‌ స్కూళ్లలో వైఐఐవోఈకి 29 స్కూళ్లను ఎంపిక చేశారు. కామారెడ్డి జిల్లా నాగిరెడ్డిపేట మండలం గోపాల్‌పేట మోడల్‌స్కూల్‌తోపాటు నిజామాబాద్‌ జిల్లా బాల్కొండ మండలం వేంపల్లి మోడల్‌ స్కూల్‌ను ఎంపిక చేశారు.

గంటల ప్రతిపాదికన బోధన

వైఐఐవోఈ శిక్షణ కేంద్రాల్లో విద్యార్థులకు బోధించేందుకు ప్రత్యేకంగా అధ్యాపకులను నియమించనున్నారు. వీరికి గంటల ప్రతిపాదికన డబ్బులు చె ల్లించనున్నారు. జేఈఈ, నీట్‌, ఐఐటీ పరీక్షల శిక్షణ కేంద్రాల్లో ఆరుగురు అధ్యాపకులను నియమించనున్నారు.విద్యార్థులకు శిక్షణతోపాటు ఉచి తంగా స్టడీ మెటీరియల్‌ను అందించనున్నారు. ఒ క్కో శిక్షణ కేంద్రానికి రూ.13,77,600 చొప్పున బడ్జెట్‌ కేటాయించనున్నారు. అందులో రూ.11,85,600 అధ్యాపకుల పారితోషికానికి, రూ.1,92,000 స్టడీ మెటీరియల్‌కు కేటాయించనున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement