నిర్మల్‌ | - | Sakshi
Sakshi News home page

నిర్మల్‌

Sep 24 2026 12:00 AM | Updated on Sep 24 2026 12:00 AM

గురువారం శ్రీ 24 శ్రీ సెప్టెంబర్‌ శ్రీ 2026 కేవలం 3 వార్మర్లతో చికిత్స పొందుతున్న చిన్నారులు నిర్మల్‌చైన్‌గేట్‌: పుట్టినప్పుడే అనారోగ్య సమస్యలు ఉన్న చిన్నారులకు, నెలలు నిండకుండా పుట్టిన నవజాత శిశువులకు ఎస్‌ఎన్‌సీయూలో చికిత్స అంది స్తారు. జిల్లాకు కీలక వైద్య కేంద్రంగా ఉన్న ప్రసూతి ఆస్పత్రిలో 20 పడకల ఎస్‌ఎన్‌సీయూ ఉంది. ఈ విభాగంలో వార్మర్లు, ఆక్సిజన్‌, ఇతర వైద్య పరికరాలు నిరంతరం పనిచేస్తుంటాయి. ఆదిలాబాద్‌ ఎస్‌ఎన్‌సీయూలో అగ్ని ప్రమాదం నేపథ్యంలో నిర్మ ల్‌, భైంసా ఆస్పత్రుల్లోనూ భద్రతా లోపాలు బయటపడ్డాయి. షార్ట్‌ సర్క్యూట్‌ లేదా ఏసీలో సమస్యతో పొగవస్తే తొలి క్షణాల్లోనే గుర్తించే వ్యవస్థ ఉందా? పరి స్థితి విషమించి మంటలు చెలరేగితే పసికందులను ఎంత వేగంగా సురక్షిత ప్రాంతానికి తరలించగల రు? ఆదిలాబాద్‌ రిమ్స్‌లో సోమవారం అర్ధరాత్రి అగ్ని ప్రమాదం జరగడంతో ఈ చర్చ మొదలైంది. ‘సాక్షి’ బృందం ఆస్పత్రిలో పరిశీలించగా అగ్ని మాపక పరికరాలు, ఫైర్‌ ఎగ్జిట్‌లు ఉన్నా ఎస్‌ఎన్‌సీయూలో పొగను గుర్తించే స్మోక్‌ డిటెక్టర్లు, స్ప్రింక్లర్లు, ఫైర్‌ పైప్‌లైన్లు లేవు. ఫైర్‌ అలారం కూడా సిబ్బంది మోగించాల్సి ఉంటుంది. ఆదిలాబాద్‌ రిమ్స్‌ ఘటన నేపథ్యంలో రాష్ట్రంలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో భద్రత, ఫైర్‌ ప్రివెన్షన్‌ ఆడిట్‌పై ప్రభుత్వం దృష్టి సారించింది. ఫైర్‌ అలారం వ్యవస్థ, ఫైర్‌ ఎక్స్‌టింగ్విషర్లు, ఎమర్జెన్సీ ఎగ్జిట్‌లు, విద్యుత్‌ వైరింగ్‌, జనరేటర్‌, ఏసీ యూనిట్లు, ఎలక్ట్రికల్‌ లోడ్‌, వార్షిక ఎలక్ట్రికల్‌ సేఫ్టీ ఆడిట్‌లు సక్రమంగా జరుగుతున్నాయా అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. పెద్దల వార్డులతో పోలిస్తే నవజాత శిశు విభాగం పరిస్థితి పూర్తిగా భిన్నం. నడవలేని, స్వయంగా బయటకు రాలేని పసికందులు ఇంక్యుబేటర్లు, వార్మర్లలో ఉంటారు. అత్యవసర పరిస్థితి తలెత్తితే వారిని పరికరాలతో సహా సురక్షిత ప్రాంతానికి తరలించాలి. అందుకే వైద్య పరికరాల లభ్యతతో పాటు అత్యవసర తరలింపు ప్రణాళిక కూడా కీలకం. ఏదైనా ప్రమాదం జరిగినా వారిని ప్రాణాలతో బయటకు తీసుకెళ్లడం ముఖ్యమని వైద్యవర్గాలు అంటున్నాయి. దీనిపై ఉన్నతాధికారులు దృష్టి సారించాల్సిన అవసరం ఉంది.

న్యూస్‌రీల్‌

శిశుసంరక్షణ కేంద్రంలో గతంలో పనిచేసిన డాక్టర్లలో కొందరు బదిలీపై వెళ్లారు. మరికొందరు రెగ్యులర్‌ ఉద్యోగం రావడంతో వెళ్లారు. నలుగురు ఎస్‌ఎన్‌సీయూ వైద్యుల పోస్టులు ఖాళీగా ఉండగా ప్రస్తుతం మెడికల్‌ కాలేజీకి అనుబంధంగా ఉన్న ఇద్దరు అసిస్టెంట్‌ ప్రొఫెసర్లు మాత్రమే విధులు నిర్వహిస్తున్నారు.

మాతా శిశు సంరక్షణ కేంద్రం ప్రభుత్వ మెడికల్‌ కళాశాల అనుబంధ ఆస్పత్రిలో భాగమైనా అది నేషనల్‌ హెల్త్‌ మిషన్‌ (ఎన్‌హెచ్‌ఎం) పరిధిలో ఉంటుంది. సెంటర్‌ నిర్వహణ, మందులు, పరికరాలు, సిరంజీలు, ఇతర మరమ్మతులకు నిధులు ఎన్‌హెచ్‌ఎం నుంచి రావాల్సి ఉంది. గత కొన్ని నెలలుగా నిధులు రావడం లేదు. దీంతో అక్కడికి కావాల్సిన మందులు, ఇతర వస్తువులను జనరల్‌ ఆస్పత్రి నిధుల ద్వారా కొనుగోలు చేయాల్సి వస్తోంది. ఇవి సరిపడా లేకపోవడంతో పిల్లలకు సరైన వైద్య సేవలు అందడం లేదని తల్లిదండ్రులు చెబుతున్నారు.

ఎస్‌ఎన్‌సీయూలో గతంలో 13 వార్మర్లు ఉండగా ప్రస్తుతం మూడు మాత్రమే పనిచేస్తున్నాయి. ఈ యూనిట్‌లో నెలలోపు పసికందుల్లో కామెర్లు, శ్వాస సంబంధిత సమస్యలు, ఇన్ఫెక్షన్లు, ఫిట్స్‌, తక్కువ బరువుతో పుట్టినవారు, తీవ్ర అనారోగ్యంతో ఉన్న నవజాత శిశువులకు చికిత్స అందిస్తారు. ఎన్‌ఐసీయూలో అత్యంత సీరియస్‌ కేసులకు వెంటిలేటర్‌, తక్కువ బరువున్న శిశువులకు వార్మర్లు, శ్వాస ఇబ్బందులకు సీపాప్‌ తదితర పరికరాలు కీలకం. అవి అవసరానికి తగిన సంఖ్యలో లేవు. ఒక వార్మర్‌లో ఒకరిని పడుకోబెట్టాల్సి ఉండగా ఇద్దరిని పడుకోబెడుతున్నారని, కొన్ని పరికరాలు పనిచేయని పరిస్థితిలో ఉన్నాయని ఆరోపణలున్నాయి. సరిపడా వెంటిలేటర్లు, సీపాప్‌ లేక శిశువుల ప్రాణాలు ప్రమాదంలో పడుతున్నాయనే విమర్శలు ఉన్నాయి. కొన్ని పరికరాలు పనిచేయకపోయినా ప్రత్యామ్నాయాలు లేక వైద్యులు, శిశువులు ఇబ్బందులు పడుతున్నారన్న ఫిర్యాదులున్నాయి. ఎన్ని పరికరాలు అవసరం? ప్రస్తుతం ఎన్ని ఉన్నాయి? వాటిలో పనిచేస్తున్నవి ఎన్ని? అనే వివరాలపై ఆస్పత్రి యాజమాన్యం నుంచి స్పష్టమైన సమాధానం రావడం లేదు. పరికరాల కొరతపై అధికారులు, సిబ్బంది పలుమార్లు దృష్టికి తీసుకెళ్లినా బడ్జెట్‌ సమస్యల వల్ల పరిష్కారం ఆలస్యమవుతోంది.

నిర్మల్‌ ఎస్‌ఎన్‌సీయూలో భద్రతా లోపాలు కానరాని స్మోక్‌ డిటెక్టర్లు స్ప్రింక్లర్లు, పైప్‌లైన్‌ ఇంక్యుబెటర్లు, వార్మర్లు, సీపాప్‌, వెంటిలెటర్ల కొరత పని చేయని ఏసీలతో ఇబ్బందులు

నిమజ్జనానికి పటిష్ట భద్రత

నిర్మల్‌టౌన్‌: ఈ నెల 25న జిల్లా కేంద్రంలో జరగనున్న గణేశ్‌ నిమజ్జనోత్సవానికి పటిష్ట భద్రత ఏర్పాటు చేయనున్నట్లు బాసర జోన్‌–2 డీఐజీ ఆర్‌.భాస్కరన్‌ తెలిపారు. జిల్లా పోలీస్‌ గెస్ట్‌హౌస్‌కు బుధవారం చేరుకున్న డీఐజీకి ఎస్పీ జానకీషర్మిల స్వాగతం పలికారు. అనంతరం డీఐజీ పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా గణేశ్‌ నిమజ్జన ఏర్పాట్లపై జిల్లా పోలీస్‌ అధికారులతో డీఐజీ సమీక్ష నిర్వహించారు. శోభాయాత్రసాగే మార్గాలు, బందోబస్తు, ట్రాఫిక్‌ నియంత్రణ, సీసీ కెమెరాల ద్వారా పర్యవేక్షణ, నిమజ్జన ప్రాంతాల్లో ప్రజల భద్రత తదితర అంశాలపై చర్చించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని, శోభాయాత్ర ప్రశాంతంగా సాగేలా సమన్వయంతో విధులు నిర్వహించాలని అధికారులకు సూచించారు. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయాలని ఆదేశించారు.

భద్రత ఆడిట్‌పై దృష్టి

ఖాళీగా వైద్యుల పోస్టులు

నిధుల కొరతతో నీరసం

పనిచేసేవి మూడు వార్మర్లే..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement