ఆరోగ్యమే మహాభాగ్యం | - | Sakshi
Sakshi News home page

ఆరోగ్యమే మహాభాగ్యం

Sep 24 2026 12:00 AM | Updated on Sep 24 2026 12:00 AM

దిలావర్‌పూర్‌: ప్రతీ వ్యక్తి సంపూర్ణ ఆరోగ్యంగా ఉండడమే మహాభాగ్యమని జిల్లా వైద్యాధికారి డాక్టర్‌ రాజేందర్‌ అన్నారు. మండలంలోని సిర్గాపూర్‌ గ్రామంలో బుధవారం 11వ ఆయుద్వేద దినోత్సవం బుధవారం నిర్వహించారు. ఆయుర్వేదం, యునానీ, హోమియోపతి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మెగా వైద్య శిబిరాన్ని రాజేందర్‌ ప్రారంభిచారు. ప్రతీవ్యక్తి దినచర్యలో భాగంగా యోగా, నడక అవసరమన్నారు. ఆయుష్‌ జిల్లా ఇన్‌చార్జి డాక్టర్‌ నారాయణరావు మాట్లాడుతూ గ్రామాల్లో తాము చేపడుతున్న వైద్య శిబిరాలకు మంచి స్పందన లభిస్తోందన్నారు. ప్రతీ ఆస్పత్రి ఆవరణలో యునానీ, ఆయుర్వేద, హోమియోపతి మందులు అందుబాటులో ఉంచేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేసిందని తెలిపారు. స్థానిక విద్యార్థులకు యోగాపై అవగాహన కల్పించి ఆసనాలు నేర్పాంచారు. శిబిరంలో 400 మందికి వైద్య పరీక్షలుచేసి అవసరమైనవారికి మందులు అందించారు. ఇందులో ఆయుష్‌ ఫార్మసిస్ట్‌ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు కొప్పుల నర్సారెడ్డి, వివిధ ఆస్పత్రుల డాక్టర్లు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement